– పార్టీలు వెంటనే బూత్ ఏజెంట్ల జాబితా అందజేయాలి
– జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి.కర్ణన్
– జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 79 కొత్త పోలింగ్ స్టేషన్ల ప్రతిపాదన
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కమిషన్ సూచన మేరకు పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్‌పై ఈనెల 26లోగా అభ్యంతరాలు సమర్పించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జాతీయ, రాష్ట్రస్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో పోలింగ్ స్టేషన్ రేషనలైజేషన్‌పై సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడిరచారు. ఇప్పటివరకు ఉన్న 329 పోలింగ్ స్టేషన్ల స్థానంలో 408 పోలింగ్ స్టేషన్లు ప్రతిపాదించామని తెలిపారు. గతంలో 132 లొకేషన్లలో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా ప్రస్తుతం 139 లొకేషన్లలో ప్రతిపాదించామన్నారు. ఈ రేషనలైజేషన్ నివేదికను ఈనెల 28లోగా ఎన్నికల కమిషన్‌కు పంపించాల్సి ఉన్నందున అభ్యంతరాలను 26లోగా తప్పనిసరిగా సమర్పించాలని కమిషనర్ సూచించారు.
బూత్ లెవెల్ ఏజెంట్లు
ఈ నియోజకవర్గంలో మొత్తం 329 పోలింగ్ స్టేషన్లకు బూత్ లెవెల్ అధికారులు (బీఎల్‌వో) అందుబాటులో ఉన్నారని కమిషనర్ తెలిపారు. అయితే కొన్ని పార్టీలు మాత్రమే బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితా సమర్పించాయని, ఇంకా ఇవ్వని పార్టీలు వెంటనే జాబితా అందజేయాలని కోరారు. కొత్తగా ఏర్పాటు చేసిన 79 పోలింగ్ స్టేషన్లకు బూత్ లెవెల్ అధికారులను త్వరలో నియమిస్తామని చెప్పారు.
క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్
7జనవరి 6 నుండి ఆగస్టు 15 వరకు మొత్తం 19,237 ఓటర్ల నమోదు దరఖాస్తులు అందగా వాటిలో 3,767 తిరస్కరణకు గురయ్యాయని, ఇంకా 16 పెండిరగ్‌లో ఉన్నాయని కమిషనర్ వివరించారు. ఫారం 6 ద్వారా వచ్చిన 5,426 దరఖాస్తుల్లో 1,478 తిరస్కరించగా ఫారం 7 ద్వారా వచ్చిన 3,453 దరఖాస్తుల్లో 1,010 తిరస్కరణకు గురయ్యాయని, 12 పెండిరగ్‌లో ఉన్నాయని, ఫారం 8 ద్వారా వచ్చిన 10,358 దరఖాస్తుల్లో 1,279 తిరస్కరించినట్లు వివరించారు. సమావేశంలో ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎన్నికల అదనపు కమిషనర్ మంగతాయారు, జూబ్లీహిల్స్ డిప్యూటీ కమిషనర్ ఈవోఆర్. రజనీకాంత్ రెడ్డి, తహసీల్దార్లు, బహుజన సమాజ్ పార్టీ నుండి నందేష్ కుమార్, బీజేపీ నుండి పి.వెంకటరమణ, పవన్‌కుమార్, సుప్రియ గౌడ్, ఆమ్ ఆద్మీ పార్టీ నుండి విజయ్ మల్లంగి, సీపీఎం నుండి ఎం. శ్రీనివాసరావు, కాంగ్రెస్ నుండి రాజేష్ కుమార్, టీడీపీ నుండి బి.వై.శ్రీకాంత్, విజయరత్న, ఏఐఎంఐఎం పార్టీ నుండి సయ్యద్ ముస్తాక్ కలియుల్లా తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.


