– మేడారంలోనే అధికారం యంత్రాంగం బస
– విధుల్లో 42027 అధికార్లు
– నిరంతరాయంగా మొబైల్ నెట్వర్క్
– అప్రమత్తంగా అత్యవసర బృందాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 17: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర 2026కు తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయి లో ఏర్పాట్లు చేపట్టింది. కోట్లాది భక్తులు త ల్లుల దర్శనానికి వచ్చే ఈ మహా పర్వంలో ఎ క్కడా ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్య లు తీసుకుంటోంది. ఈ ఏర్పాట్లన్నింటిపై ని త్యం ప్రత్యక్ష పర్యవేక్షణ చేయడానికి రాష్ట్ర మంత్రులు, అధికార యంత్రాంగం మేడా రంలోనే బస చేస్తూ, క్షేత్రస్థాయిలో ప్రతి అం శాన్ని పరిశీలిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం, సుభిక్ష దర్శనం ప్రథమ ప్రాధాన్యతగా మారింది. ఈ సారి సుమారు మూడు కోట్ల మంది భక్తులు వస్తార నే అంచనాతో, ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు కలిసి సమగ్ర ప్రణాళికతో పని చేసేలా నిరంతరం పర్యవేక్షి స్తున్నారు. ఈ జాతర కోసం మొత్తం 21 శాఖలకు చెందిన 42,027 మంది అధికారులు, సిబ్బంది, మేడారం పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వ హించనున్నారు. వీరికి అదనంగా 2 వేల మం ది ఆదివాసీ యువత వాలంటీర్లుగా తమ సేవలు అందించనున్నారు. మోబైల్ నెట్ వర్క్ కి ఎలాంటి అంతరాయం కలగకుండా 27 శాశ్వత టవర్లతో పాటు తాత్కాలిక పద్ధతిలో 33 మోబైల్ టవర్లను, 450 వెరీ హై ఫ్రీక్వెన్సీ సెట్లను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని క్రమబద్ధంగా నియంత్రించేందుకు మేడారం ప్రాంతాన్ని 8 పరిపాలనా జోన్లుగా, 42 సెక్ట ర్లుగా విభజించారు. ఒక్కో జోస్ కు జిల్లా సా యి అధికారి ఇంచార్జ్ గా వ్యవహరిస్తారు. ఒ క్కో సెక్టార్ కు మండల స్థాయి అధికారి భా ధ్యతలు నిర్వర్తిస్తారు. ఆలయ ప్రాంగణం, గద్దె లు, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్, ఊరట్టం, శివరాం సాగర్, నర్లాపూర్, పడిగాపూర్ వంటి అన్ని కీలక ప్రాంతాల్లో కంట్రోల్ రూములు, మిస్సింగ్ పర్సన్స్ క్యాంపులు, అత్యవసర స్పం దన బృందాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్య వేక్షిస్తున్నారు. భక్తుల రాకపోకల్లో ఇబ్బందులు రాకుండా మొత్తం 525 చోట్ల రహదారి సమ స్యలను గుర్తించి పరిష్కరించారు. జాతరకు ఉపయోగపడే కొత్త రోడ్లు, మరమ్మత్తులు, కల్వర్టులతో రవాణా వ్యవస్థను బలోపేతం చేశారు.
1,418 ఎకరాల విస్తీర్ణంలో 42 పార్కింగ్ ప్రాంతాలు
వాహనాల రద్దీ తగ్గించేందుకు అటవీ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 1,418 ఎకరాల విస్తీర్ణంలో 42 పార్కింగ్ ప్రాంతాలు సిద్ధం చేశారు. తాగునీటి సమస్య తలెత్తకుండా మిషన్ భగీరథ ద్వారా నిరంతం తాగు నీటి సరఫరా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 5,482 తాగు నీటి నల్లాలు ఏ ర్పాటు చేసి భక్తులకు శుద్ధమైన నీటిని అంది స్తున్నారు. జంపన్నవాగులో పవిత్ర స్నానాలు చేసే భక్తుల కోస 119 డ్రెస్సింగ్ రూములు ఏర్పాటు చేయడంతో పాటు నీటి పరిశుభ్రత కోసం ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయనున్నా రు.285 బ్లాకుల్లో 5700 టాయిలెట్లను సిద్ధం చేశారు. వీటికి అదనంగా మోబైల్ టాయిలెట్స్ ను అందుబాటులోకి తేనున్నారు. పారిశుధ్య నిర్వహణ కోసం 5 వేల మంది సిబ్బందిని, 150 ట్యాంకర్లు, 100 ట్రాక్టర్లు, 18 స్వీపింగ్ మిషిన్లు, 12 జేసీబీ, 40 స్వచ్ఛ ఆటోలు, 16 డోజర్లను రంగంలోకి దింపారు.
జాతర ప్రాం తంలో విద్యుత్ సరఫరా అంతరాయం లేకుం డా టీజీఎన్పీడీసీఎల్ ద్వారా 196 ట్రాన్స్ ఫార్మర్లు, 911 విద్యుత్ స్తంభాలు, 65.75 కిలోమీటర్ల విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ అంతరాయం తలెత్తకుండా 350 మంది సిబ్బందిని నియమించారు. ఆల యా లు, ప్రధాన మార్గాలు, పార్కింగ్ ప్రాంతాల్లో వేల సంఖ్యలో హై పవర్ లైట్లు వెలుగులు పంచుతుండగా, అత్యవసర పరిస్థితుల కోసం 28 డీజిల్ జనరేటర్లు బ్యాకప్ సిద్ధంగా ఉ న్నాయి.
51,000 ట్రిప్పులతో టీజీఆర్టీసీ 4000 బస్సులు
భక్తులు సులభంగా మేడారానికి చేరుకునేందుకు టీజీఆర్టీసీ ఈసారి 4000 బస్సులను వినియోగంలోకి తెచ్చి 51,000 ట్రిప్పులు నిర్వహిస్తోంది. ప్రత్యేక బస్టాండ్లు, ప్రత్యేక రూట్లతో రవాణా వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహిస్తున్నారు. జాతర కోసం 10441 మంది ఆర్టీసీ సిబ్బంది సేవలందించనున్నారు.. గంటకు 15 బస్సులు ప్రయాణించేలా ప్లాన్ చేస్తున్నారు. జాతర సమయంలో ఆరోగ్య సేవల కోసం మొత్తం 5,192 మంది వైద్య సిబ్బందిని నియమించారు. భక్తులకు సేవలందించేందుకు 30 అంబులెన్సులు, 40 బైక్ అంబులెన్సులు, 50 పడకల ప్రధాన ఆసుపత్రి. రోజుకు 30 మెడికల్ క్యాంపులు పనిచేస్తాయి. జంప న్నవాగులో ప్రమాదాలను నివారిం చేందుకు 210 మంది గజ ఈతగాళ్లు. 12 మంది సింగరేణి రెస్క్యూ సిబ్బంది, 100 ఎస్ డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. అగ్నిప్రమాదాలను ఎదుర్కొనేందు కు 15 ఫైర్ బ్రిగేడ్ వాహనాలు, 268 మంది ఫైర్ ఫైటర్లు సిద్ధంగా ఉన్నారు. అటవీ శాఖ ద్వారా పార్కింగ్, రోడ్లతోపాటు పర్యావరణ సంరక్షణ చేపడుతుండగా, ఐటిడీఏ ఆధ్వ ర్యంలో గిరిజనులకు కొబ్బరి కాయ, బెల్లం. ఇతర వ్యాపారాల కోసం లైసెన్సులు ఇచ్చి ఉ పా ధి కల్పిస్తున్నారు. మొత్తంగా మేడారం మహాజాతర-2026ను ప్రపంచ స్థాయిలో నిర్వహించాలనే లక్ష్యంతో, అన్ని శాఖల సమ స్వయంతో భక్తులకు త్వరితగతిన తల్లుల దర్శ నం, సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావ రణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తోంది.
అత్యాధునిక వసతులతో మీడియా సెంటర్
మేడారం మహా జాతర విశేషాలను దేశవిదేశీ భక్తులకు అనుక్షణం ఎప్పటికప్పుడు అందించేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్, ఇతర ప్రచార, ప్రసార మాద్యమాల సౌకర్యార్ధం రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ అమ్మవార్ల గద్దెల పక్కన ఉన్న టీటీడీ కళ్యాణ మండపంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా మీడియా సెంటర్ ఏర్పాటు చేసింది. ఈ సెంటర్ నుండి, ఫోటోలు, వీడియోలు, వార్తలు నేరుగా పంపించుకొనే ఏర్పాటు చేశారు. 100+100 ఎంబీపీఎస్ సామర్ధ్యం కలిగిన ఇంటర్నెట్ సదుపాయం. 20 హై కన్ఫిగరేషన్ కంప్యూటర్లు, జిరాక్స్ మిషన్, ఫ్యాక్స్, ప్రింటర్లు, ల్యాండ్ ఫోన్ సౌకర్యంతోపాటు, భోజన వసతి కూడా కల్పించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





