– ‘ష్రే మొబిలిటీ’తో మహిళా భద్రత విభాగం ఒప్పందం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: రాష్ట్ర పోలీస్ మహిళా భద్రతా విభాగం (ఉమెన్ సేఫ్టీ వింగ్) మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి లక్ష్యంగా ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన డీలర్ ష్రే మొబిలిటీ ఎలఎల్‌పీతో మంగళవారం ఎంఓయు చేసుకుంది. ‘ఉమెన్-లెడ్ మొబిలిటీ లైవ్లీహుడ్స్- హైదరాబాద’ పైలట్ ప్రాజెక్టు అమలు కోసం ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన డీలర్ ష్రే మొబిలిటీ ఎలఎల్‌పీతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈమేరకు మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ చారు సిన్హా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా నగరంలోని అర్హులైన మహిళలకు డ్రైవింగ్ నైపుణ్యాలలో వృత్తిపరమైన శిక్షణ అందించడమేకాÅ£ వారు సొంతంగా ఎలక్ట్రిక్ వాహనాలను పొందేలా మార్గం సుగమం చేస్తారు. తద్వారా మహిళలు డ్రైవర్లుగా, వెహికల్ ఆపరేటర్లుగా స్థిరపడి ఆర్థికంగా ఎదిగేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడనుంది. ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేని ఈ సహకార ఒప్పందం ద్వారా శిక్షణ పొందిన లబ్ధిదారులకు ష్రే మొబిలిటీ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల లభ్యతలో తోడ్పాటును అందిస్తుంది. హైదరాబాద్ నగరంలో పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థను ప్రోత్సహిస్తూనే మహిళలను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దేందుకు ఈ వినూత్న కార్యక్రమం దోహదపడుతుందని చారుసిన్హా ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




