– కేరళలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31: దివ్యాంగుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. కేరళకు చెందిన దివ్యాంగ్ చైల్డ్ వుమెన్ వెల్ఫేర్ సొసైటీకి చెందిన సభ్యులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం ప్రజాభవన్లో సమావేశమయ్యారు. దివ్యాంగులు కూడా సమాజంలో భాగమేనని, వారి అభ్యున్నతికి ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. వైకల్యం దురదష్టకరమే అయినా వారిని సమాజంలో అందరితో సమానంగా అభివృద్ధి చేసేందుకు మనమంతా పనిచేయాలన్నారు. కేరళలో కూడా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఆ ప్రభుత్వంలో అన్ని వర్గాలతో సమానంగా దివ్యాంగులకు అవకాశాలు లభిస్తాయని భట్టి చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





