దేశ భవిష్యత్తు మార్చేది విద్య మాత్రమే

– ప్రతి ఒక్కరూ చదువుకోవాలి
– ఇదే జాతీయ విద్యా విధానం
– మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ ఆశయాలే లక్ష్యం
– స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌

వికారాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 11: దేశ భవిష్యత్తును మార్చ గల శక్తి విద్యకు మాత్రమే ఉందని శాసన సభ సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. భారత రత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జ‌యంతిని పురస్కరించుకొని మైనారిటీ బాలికల గురుకుల జూనియర్‌ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ విద్య, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రసాద్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి కీ విద్య అందాలి.. అందరూ చదువుకోవాలి అనేదే జాతీయ విద్య దినోత్సవ ఉద్దేశమన్నారు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ భారతదే శానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఈ దేశ విద్యా విదాన రూపకల్పనలో క్రియాశీల పాత్రను పోషించారని తెలిపారు. విద్యతోనే దేశం, సమాజం కూడా అభివృద్ధి చెం దుతాయనే లక్ష్యంతో దేశ భవిష్యత్తు మార్చేది విద్య మాత్రమే అబుల్ కలాం ఆజాద్ విద్యాభివృద్ధికి అనేక ఆధునిక సంస్కరణలు తీసు కువచ్చారని ఆయన తెలిపారు. దేశంలో ఐఐటిలను స్థాపించి ఆధునిక విద్యకు శ్రీకా రం చిట్టిన మహా వ్యక్తి మౌలానా అబుల్ క లాం ఆజాద్ అని పేర్కొన్నారు. ఆయన అడు గు జాడల్లో నడుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నది. అందుకే తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ దేశానికి ఆదర్శంగా ఉన్నాయని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్ళు, గురుకులాలలో ఎనిమిది లక్షల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారని గురుకులాలలో చదువుకునే పిల్లలు ప్రభుత్వ పిల్లలు అంటే మా పిల్లలని మాబిడ్డలు ఎంతో మీరు కూడా మాకు అంతే అన్న భావనతో పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్ కాస్మోటిక్ చార్జీలు పెంచమని సభాపతి ఈ సందర్భంగా గుర్తు చేశారు. మానవత్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైట్ చార్జీలు 40 శాతం కాస్మోటిక్ చార్జీలు 200 శాతం పెంచుతూ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందుతున్నదని ప్రభుత్వ హాస్టళ్ళలో సన్న బియ్యంతో అన్నం పెడుతున్నారని తెలుపుతూ గతంలో కంటే మీకు ఇప్పుడు మంచిగా భోజనం అందుతుందా? అని విద్యార్థినిలను అడుగగా మంచిగా అందుతుందని చప్పట్ల ద్వారా సమాధానమిచ్చారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వ వసతి గృహాలకు వంట సామాగ్రిని అందించడం అభినందనీయమని స్పీకర్ అన్నారు. అన్ని వర్గాల పిల్లలు కలిసి మెలసి చదువుకోవడానికి అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 200 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజా ప్రభుత్వం వచ్చాకనే మొదటిసారి డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడం జరిగిందని అదేవిధంగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం దేశంలోనే మొట్టమొదటిసారి విరాట్ కమిషన్ నియమించడంతోపాటు యువత కోసం సిల్యూని వర్శిటీ ఏర్పాటు చేయడం జరిగిందని స్పీకర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తూనే ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో వారి సంక్షేమానికి రూ.3591కోట్లను కేటాయించిందని, అదేవిధంగా మాజీ ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ ను మంత్రి మండలి లోకి తీసుకున్నట్లు సభావతి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ లోని పాతబస్తీ మీదుగా మెట్రో రైలు ఏర్పాటు చేసే పనులు ప్రారంభించిన క్రమంలో ఇది ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ అని తెలి యజేశామని స్పీకర్ పేర్కొన్నారు. వికారాబాద్ లో గురుకుల పాఠశాలకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్ కు సూచిస్తూ నిర్మాణ పనులకు సంబంధించి నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకునే దిశగా కృషి చేయాలన్నారు. ఆజాద్ స్థాపించిన ఐఐటీలోనే విద్యను అభ్యసించానని కలెక్టర్ తెలిపారు. నీట్, ఐఐటి పోటీ పరీక్షలకు ఆన్ లైన్ ద్వారా శిక్షణ పొందేందుకు ఫిజికల్ వాళ ఆన్లైన్ కోచింగ్ ను కొనుగోలు చేయడం జరిగిందని, దీనిని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు అధిగమించాలని సూచించారు. ముందు గా నీట్ ఐఐటి పరీక్షలకు ఆన్లైన్ ద్వారా శిక్షణకు సంబంధించిన ల్యాబ్లను సభాపతి, జిల్లా కలెక్టర్ ప్రారంభించి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు మెరిటోరియల్ సర్టిఫికెట్లు, మెమొంటోలను ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఆర్ టిఎ సభ్యులు జాఫర్ కళాశాల ప్రిన్సిపాల్ మహబూబా ఫాతిమా మైనార్టీ నాయకులు మహమ్మద్ హఫీజ్ వహీద్ ఆశం, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page