– అండర్ వరల్డ్ డాన్ ఇందర్జీత్ సింగ్ ఇంట్లో సోదాలు
భారీగా లెక్క చూపని బంగారం, వజ్రాలు, నగదు పట్టివేత
న్యూదిల్లీ, జనవరి 1: మనీలాండరింగ్ కేసుకు సంబంధించి స్వర్ణప్రియ విహార్ ప్రాంతంలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ ఇందర్జీత్ సింగ్ యాదవ్, అతని అనుచరుల ఇండ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కళ్లు చెదిరేలా డబ్బులు, బంగారు నగలు బయటపడ్డాయి. లెక్కల్లో చూపని రూ.5 కోట్ల నగదు, రూ.8 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు ఉన్న సూట్‌కేసు, రూ.35 కోట్ల విలువైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం రూ.48 కోట్ల వరకు ఉంటుందని ఈడీ తెలిపింది. ప్రస్తుతం అమన్ కుమార్, ఇందర్జీత్ సింగ్ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొంతమంది రాజకీయ నాయకుల అండతో ఇందర్జీత్ ప్రైవేట్ ఫైనాన్షియర్లు, బిల్డర్లు, కాంట్రాక్టర్లను బెదిరిస్తూ డబ్బులు కూడబెట్టినట్లు సమాచారం. సోదాల సందర్భంగా డబ్బును లెక్కించడానికి బ్యాంకు అధికారులు కౌంటింగ్ మిషన్లు తెప్పించినట్లు తెలుస్తున్నది. సందర్జీత్ యాదవ్, అతని అనుచరులపై హర్యానా, యూపీ రాష్ట్రాల్లో 15కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడన్న కారణంగా ఆయుధాల చట్టంతోపాటు ఇతర కేసులు నమోదు చేసి అధికారులు. చార్జిషీట్లు కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ డబ్బులు, నగలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ విూడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





