6.8 శాతం నుంచి 7.2 శాతం జీడీపీ వృద్ధి

-పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వే
-ఉభయ సభల్లో ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్

న్యూదిల్లీ, జనవరి 29: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2025-26 ఆర్థికసర్వే ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్  గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. తర్వాత రాజ్యసభలో కూడా మంత్రి సర్వేను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.గత ఆర్థిక సంవత్సరంలో భారత్ సాధించిన అభివ ద్ధి, ఎదురైన సవాళ్లు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు తదితర కీలక విషయాలను ఆర్థిక సర్వేలో ప్రస్తావిస్తారన్న విషయం తెలిసిందే. 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత దేశ రియల్ జీడీపీ 6.8 శాతం నుంచి 7.2 శాతం వృద్ధి న‌మోదు చేసే అవకాశం ఉందని ఆర్థిక సర్వే తేల్చింది. సుస్థిర దేశీయ డిమాండ్, స్థూల ఆర్థిక అంశాలు సానుకూలంగా ఉండటంతో భారత ఆర్థిక ప్రగతికి ఢోకా లేదని ఆర్థిక సర్వే తేల్చింది. ఈ సర్వే ప్రకారం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉంది. ప్రతికూల అంశాల ప్రాబల్యం కొనసాగు తోంది. ఫలితంగా ప్రపంచ ఆర్థిక ప్రగతి ఓ మోస్తరు స్థాయిలోనే కొనసాగుతుంది. స్థూలంగా చూస్తే వస్తువుల ధరలు ఈ ఏడాదిలో స్థిరంగా కొనసాగే అవకాశం ఉంది. క త్రిమ మేధతో ఆశించిన మేర ఆర్థిక ఫలాలు అందకపోతే ఆస్తుల విలువ తరిగి ఆర్థికరంగంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. భౌగోళిక అనిశ్చితుల కారణంగా పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత నెమ్మదించవచ్చు. ప్రస్తుత పరిస్థితి నిలకడగా ఉన్నా రాబోయే రోజుల్లో ప్రతికూలతలు పెరిగి పరిస్థితి వికటించే అవకాశం ఉందని కూడా ఆర్థిక సర్వే అంచనా వేసింది.అమెరికా సుంకాల భారం ఉన్నా భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు తీసిందని ఆర్థిక సర్వే తేల్చింది. సుంకాల విధింపు తరువాత జీడీపీ వృ ద్ధి అంచనాలు తగ్గినా వాస్తవంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం చేపట్టిన వ్యవస్థాగత మార్పులు, విధానపరమైన నిర్ణయాల కారణంగా సుంకాల భారాన్ని భారత్ తట్టుకోగలిగిందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును.. రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఈ ఎకనామిక్ సర్వే. ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ఎకనామిక్ అ్గªర్స్ డిపార్ట్‌మెంట్‌లోని ఎకనామిక్ డివిజన్ ఈ సర్వేను రూపొందిస్తుంది. తొలుత 1950-51 సంవత్సరం నుంచి ఆర్థిక సర్వేను బడ్జెట్ తో పాటే ప్రవేశపెట్టేవారు. 1960 తర్వాత బ్జడెట్‌కు ముందు ప్రవేశపెట్టే సంప్రదాయం మొదలైంది.     2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ.. దేశ జీడీపీ 6.8-7.2 శాతంగా ఉండొచ్చు. గతేడాదితో పోలిస్తే అంచనాలను పెంచింది. 2025-2026కు జీడీపీ అంచనాలను 7.4 శాతం నుంచి తగ్గించింది. ఇటీవల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.4% వృ ద్ధి రేటు నమోదుకావొచ్చని గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వశాఖ అంచనా వేసిన సంగతి తెలిసిందే.  2024-2025 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 4.8శాతం. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో అది 4.4 శాతంగా ఉంటుందని సర్వే అంచనా వేసింది. అంతర్జాతీయంగా అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ.. 2026-2027కు భారత్‌లో స్థిరమైన వృద్ధి నమోదవు తుందని అంచనా వేసింది.వికసిత్ భారత్‌ను సాధించడంలో వ్యవసాయరంగం కీలకపాత్ర పోషిస్తుంది.    దేశీయంగా తయారీ, ఎగుమతులు ఎలక్టా నిక్ రంగం వ ద్ధికి దోహదం చేస్తున్నాయి. ఇందులో మొబైల్ తయారీ కీలకం. పదేళ్లలో ఉత్పత్తి విలువ 30 రెట్లు పెరిగి.. రూ.18వేల కోట్ల నుంచి రూ.5.45 లక్షల కోట్లకు చేరింది. డిజిటల్ సేవల విషయంలో గ్రామాలు, పట్టణాల మధ్య అంతరం తగ్గుతోంది. ఇటీవల భారత్`ఈయూ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ గురించి ప్రస్తావించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *