‘స్థానిక’ ఎన్నికలపై ఈసీ కసరత్తు

– వివిధ విభాగాల అధికారులతో కమిషనర్‌ ‌భేటీ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 27: ‌రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా త్వరలో మోగనుంది.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్నికల సన్నాహాల కోసం ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించింది.తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ‌రాణికుముదినీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎస్‌ ‌రామకృష్ణారావు, అదనపు డీజీ మహేశ్‌ ‌భగవత్‌, ‌పంచాయతీరాజ్‌, ఆర్థిక శాఖల ముఖ్యకార్యదర్శులు, ఎక్సైజ్‌ ‌కమిషనర్‌ ‌తదితరులు హాజరయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *