ఉత్తరాదిన భూకంపం

– రిక్టర్‌ స్కేలుపై 4.4గా నమోదు
– భయకంపితులైన ప్రజలు

దిల్లీ: దిల్లీతోపాటు పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం భూకంపం సంభవించగా ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఉదయం 9.04 గంటలకు భూమి కంపించగా రిక్టర్‌ స్కేలుపై 4.4గా నమోదైంది. హరియాణాలోని రaుజ్జర్‌కు ఈశాన్యాన 3 కి.మీ దూరంలో పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్లడిరచింది. ఈ ప్రాంతం పశ్చిమ దిల్లీకి కేవలం 51 కి.మీ దూరంలో ఉంటుంది. దేశ రాజధానిలో భూప్రకంపనలు భారీగానే చోటుచేసుకున్నాయి. రాజస్థాన్‌, యూపీ సహా పలు రాష్ట్రాల్లోనూ భూమి కంపించింది. గతంతో పోలిస్తే ఈసారి ప్రకంపనల తీవ్రత ఎక్కువగానే ఉందని చెబుతున్నారు. అనేకచోట్ల ప్రజలు, ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. ప్రజలు ఆందోళనకు గురికావద్దని, ఇలాంటి సమయాల్లో లిఫ్ట్‌కు బదులు మెట్లు దిగి కిందకు రావాలని ఎన్డీఆర్‌ఎఫ్‌ సూచనలు జారీ చేసింది. మరోవైపు దిల్లీలో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *