యుద్దం వేళ ఇరాన్‌లో భూకంపం

టెహ్రాన్, మార్చి 3: ఇజ్రాయెల్, అమెరికాలు వైమానిక దాడులతో హడలెత్తిస్తున్న వేళ ఇరాన్‌ను భూకంపం కూడా వణికిస్తోంది. ఇరాన్‌లోని గెరాష్ ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభంచింది. గెరాష్ సమీప ప్రాంతంలో భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఈ భూకంపం వల్ల జరిగిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గురించి వివరాలు బయటకు రాలేదు. కాగా, మరోవైపు ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగుతునే ఉన్నాయి. టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెర్మాన్ వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో కనీసం 13మంది ఇరాన్ సైనికులు మరణించారని స్థానిక మీడియా వెల్లడించింది. మరోవైపు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా వైమానిక స్థావరాలపై క్షిపణి దాడులు చేస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *