గాంధీనగర్, డిసెంబర్ 26: గుజరాత్లో లోని కచ్ జిల్లాలో భూ ప్రకంపనలు సంభవిం చాయి. శుక్రవారం తెల్ల వారు జామున 4.30 గంటలకు ఈ ప్రకంపనలు వచ్చాయి. ఈ భూ ప్రకం పనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4. 4 గా నమోదు అయింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ భూ ప్రకంపల కేంద్రాన్ని గుర్తించినట్లు వివరించింది. 23.65 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్, 70.23 ఈస్ట్ లాంగిట్యూడ్ మధ్య 10 కిలోటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. ఈ భూ ప్రకంపనలు సంభవించిన వెంటనే ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రకపంనల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదని ఉన్నతాధికారులు వివరించారు. మరోవైపు ఈ కచ్ జిల్లాలో తరచూ భూ ప్రకంపనలు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. కానీ స్వల్ప భూ ప్రకంపనలతో ఇక్కడ భూకంపాలు సంభవిస్తున్నాయి. 2001లో గుజరాత్లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది గాయపడ్డారు. ఈ వరుస భూప్రకంపనల కారణంగా.. స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





