– 69మంది మృతి
దిల్లీ, అక్టోబర్ 1: ఫిలిప్పీన్స్‌లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపంతో సుమారు 69 మంది మృతి చెందారు. వేలాదిమంది నిర్వాసితులయ్యారు. సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లోని సెబూ ప్రాంతం భారీ తాకిడికి గురవడంతో వందలాది ఇళ్లు నేలకూలాయి. మృతుల సంఖ్య ఎంత అనేది నిర్థారణ కాలేదు. రెక్టర్ స్కేలుపై 6.9 తీవ్రత నమోదు అయింది. బోగో, ఇతర ప్రాంతాలలో ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలో సరైన సమాచార వ్యవస్థ లేని చోట భూకంపం సంభవించడంతో సరైన సమాచారం లేకుండా పోయింది. దీనికితోడు వర్షాలు, దెబ్బతిన్న రోడ్లతో పలు ప్రాంతాల్లో ప్రజలు చిక్కుకుపోయారు. సహాయక బృందాలు భూకంప తాకిడి ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





