– 1400మంది మృతి
న్యూదిల్లీ, సెప్టెంబర్ 2: అఫ్గనిస్థాన్‌లో మంగళవారం మరోసారి భూకంపం సంభవిచంది. దేశ ఆగ్నేయ ప్రాంతంలో 6.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. తూర్పు అఫ్గనిస్థాన్‌లో 6.0 తీవ్రతతో వచ్చి భూకంపంతో ఇప్పటికే చెందగా వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదాన్ని మరువకముందే మంగళవారం మరోసారి భూకంపం వచ్చింది. ఈ భూకంపాలపై అంతర్జాతీయ సమాజం సరిగా స్పందించడంలేదని ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ అధికారి అన్నారు. అఫన్‌కు సాయం అందించేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని అఫ్గనిస్థాన్ వ్యవహారాల యునైటెడ్ నేషన్స్ ప్రతినిధి ఇంద్రిక రత్వట్టే కోరారు. అనేక సంక్షోభాలు, సమస్యలతో సతమతమవుతున్న అఫ్గన్ ప్రజల పట్ల సమాజ స్పందన సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు అఫ్గనిస్తాన్‌లో సంభవించిన భూకంపం వల్ల మరణాల సంఖ్య 1400కు చేరిందని, వెయ్యిమందికిపైగా గాయపడ్డారని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిత్ సోషల్ ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తెలిపారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పర్వత ప్రాంతం, దూర ప్రాంతానికి చేరుకోవడానికి రక్షక్ష బృందాలు ఎంతో శ్రమిస్తున్నాయని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





