హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 6: డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి చట్టబద్ధత కల్పించే బిల్లుకు శాసనమండలి మంగళవారం ఆమోదం లభించింది. తెలంగాణ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లును శాసనమండలిలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రవేశపెట్టారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ వివరాలను మండలికి వివరించారు. రూ. 500 కోట్లతో యూనివర్సిటీగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. 310 ఎకరాల సువిశాల ప్రాంగణంలో యూనివర్సిటీ విస్తరణ జరుగుతోందన్నారు. చర్చ అనంతరం బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



