ఈ-కార్‌ ‌రేస్‌ ‌కేసులో కీలక పరిణామం

– ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన ఏసీబీ
– గవర్నర్‌ అనుమతి కోరే అవకాశం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 9: సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కార్‌ ‌రేస్‌ ‌కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన నివేదికను ఏసీబీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ప్రాసిక్యూషన్‌కి అనుమతి ఇవ్వాలని నివేదిక పంపారు. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్‌ను రెండుసార్లు, ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ను మూడుసార్లు ఏసీబీ ప్రశ్నించింది. అనుమతి రాగానే ఇద్దరిపై ఛార్జ్‌షీట్‌ ‌దాఖలు చేయనున్నట్టు సమాచారం. ఫార్ములా ఈ కార్‌ ‌రేసింగ్‌ ‌వ్యవహారంపై 2024 డిసెంబరు 18న ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్‌, ఏ2‌గా ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌, ఏ3‌గా హెచ్‌ఎం‌డీఏ చీఫ్‌ ఇం‌జినీర్‌ ‌బీఎల్‌ఎన్‌ ‌రెడ్డిపై నమోదైంది. తొమ్మిది నెలలపాటు ఈ కేసును విచారించిన ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ కేసులో కేటీఆర్‌, ఐఏఎస్‌ అర్వింద్‌ ‌కుమార్‌, ‌బీఎల్‌ఎన్‌ ‌రెడ్డి, కిరణ్‌ ‌రావు, ఎఫ్‌ఈఓలను ప్రాసిక్యూట్‌ ‌చేసేందుకు గవర్నర్‌ అనుమతి రాగానే నిందితులపై చార్జ్ షీట్‌ ‌దాఖలు చేసే అవకాశం ఉంది. గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో ఫార్ములా ఈ కార్‌ ఈ ‌రేస్‌ ‌నిర్వహణ సంస్థకు హెచ్‌ఎం‌డీఏ చెల్లింపులు జరిపింది. అయితే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయిందని.. దాదాపు రూ.55 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో ఫెమా నిబంధనలు ఉల్లఘించినట్టు ఈడీ  తెలిపింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *