– ప్రజలకు భట్టి శ్రీరామనవమి శుభాకాంక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని ప్రతిష్థించిన శ్రీరాముడి జన్మదినం మనకందరికీ పండుగ రోజు. ఆదర్శవతంమైన కుమారుడిగా, మంచి భర్తగా, రక్త సంబంధాలకు, కుటుంబ విలువలకు ఆదర్శవంతమైన వ్యక్తిగా శ్రీరాముడు మనకందరికీ ఆదర్శప్రాయుడు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శ్రీరాముడి పాలన ఆదర్శంగా తెలంగాణలో ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తోందన్నారు. శుక్రవారం శ్రీరామనవమి, సీతారాముల కల్యాణం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని, ప్రతి రైతు తలెత్తుకుని జీవించేలా చేయాలని ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం కృత నిశ్చయంతో పాలన చేస్తోందని, శ్రీరాముడి ఆదర్శంగా కాంగ్రెస్ ప్రభుత్వం సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని అన్నారు. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచల సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతోందన్నారు.. ఆలయం అభివృద్ధికి మొత్తంగా రూ.586 కోట్లను ప్రజాప్రభుత్వం కేటాయించిందని, అందులో భాగంగా తొలి దశలో రూ.351 కోట్లతో ఆగమశాస్త్రానికి అనుగుణంగా ఆలయ విస్తరణ, భక్తులకు వసతులు, ఇతర అభివృద్ధి పనులు చేయనున్నట్లు తెలిపారు. అంతేకాÅ£ 2027లో గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఘాట్‌ల అభివృద్ధి, రహదారులు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు కూడా భట్టి విక్రమార్క తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





