– భోజనానికి ఆహ్వానించిన కాంగ్రెస్ నాయకుడు యూసుఫ్
కొడంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : దసరా పండుగ సందర్భంగా గురువారం కొండారెడ్డిపల్లి వచ్చిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాత్రికి కొడంగల్ చేరుకున్నారు. సీఎంతోపాటు ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, నియోజకవర్గ ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. అక్కడి తన నివాసంలో ముఖ్యమంత్రికి దసరా శుభాకాంక్షలు తెలిపేందుకు కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతీ ఒక్కరిని పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ కొడంగల్ నాయకుడు, వక్ఫ్ కమిటీ సభ్యుడు యూసుఫ్ మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. యూసుఫ్ నివాసంలో భోజనం ముగించుకుని రేవంత్‌రెడ్డి హెలికాప్టర్‌లో తిరిగి హైదరాబాద్ ప్రయాణమయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





