హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 1: దసరా పండుగ (విజయదశమి) సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయదశమి పేరుతో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. శమీ పూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలయ్ బలయ్ తీసుకోవడం.. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం.. శుభసూచకంగా భావించే పాల పిట్టను దర్శించుకోవడం తెలంగాణకు ప్రత్యేకమని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ అప్రతిహత విజయాలతో అభివృద్ధి సాధించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఈ పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి దుర్గామాతను ప్రార్థించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





