– అభివృద్ధి ఎజెండాగా మా ప్రయాణం
– జాతీయ పార్టీగా దిల్లీకి వెళుతూనే ఉంటాం
– కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి17: కేటీ ఆర్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పంది స్తూ.. ఈ విషయాన్ని కేటీఆర్ పక్కదారి పట్టి స్తున్నారని ఆరోపించారు. టెక్నికల్గా మా ట్లాడితే బీఆర్ఎస్ ఒక్క రూపాయి కూడా రుణం ఇవ్వలేదన్నారు. మహిళలంటే ఎందు కు చులకన అని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నిం చారు. మహిళా సాధికారతపై కేటీఆర్ హేళ నగా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్ బా బు అన్నారు. మీరు పావలా వడ్డీ ఇవ్వలేదు.. మేము ఇస్తున్నాం. గోబెల్స్ ప్రచారంలో బీఆర్ఎస్ ను మించిన వారు ఈ ప్రపంచంలోనే ఎవ రూ లేరు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వక పోతే మీరు ఎక్కడ ఉండేవారు. ఈరోజు కాంగ్రెస్పై అడ్డగోలుగా మాట్లాడుతున్నారు’ అంటూ కేటీఆర్పై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్య క్తం చేశారు. గవర్నర్ ప్రసంగంలో ఎంవోయూ, పెట్టుబడులపై ఆయన వివరణ ఇచ్చారు. సిఎం పదేపదే ఢిల్లీకి వెళుతున్నారని కెటిఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి తిప్పికొట్టారు. కేంద్రంతో కొట్లాడి అయినా నిధులు తెచ్చి, రాష్టాన్ని బాగు చేస్తామని అన్నారు. ప్రధాన మంత్రిని కలవడంలో తప్పేముందని అన్నారు. గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్ష సభ్యులు సలహాలు ఇస్తారని ఆశించామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని.. దిల్లీకి ఎన్నిసార్లయినా వెళ్తామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం దిల్లీ వెళ్లి ప్రధాని కేంద్రమంత్రులను కలుస్తున్నామన్నారు. ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నేతలు ఎన్నోసార్లు దిల్లీకి చక్కర్లు కొట్టారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి కేటీఆర్ సల హాలు, సూచనలు ఇస్తారని అనుకున్నామని, ఎవరో రాసిన స్క్రిప్ట్ను చదువుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నారంటూ విమర్శించారు. ప్రధానమంత్రి దగ్గరకు కేటీఆర్ ఎన్నిసార్లు వెళ్లారో లెక్క తీయాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళతామని.. ప్రధానిని మంత్రులను కలుస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ తాము దిల్లీకి వెళ్లడం లేదని అన్నారు. కేటీఆర్ సత్యదూరమైన మాటలు మాట్లా డుతున్నారన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ప్లాప్ అయింది బీఆర్ఎస్ అంటూ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



