తాగుబోతు ర్యాష్‌ ‌డ్రైవింగ్‌కు ముగ్గురు బలి

– ఇద్దరు ఇంజనీరింగ్‌ ‌విద్యార్థులు, మరో యువకుడు 

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌8: ఓ ‌తాగుబోతు డ్రైవర్‌ ‌సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. మూడు కుటుంబాల్లో కడుపుకోత పెట్టాడు. ముగ్గురు యువకులు దర్మరణం చెందారు. భవిష్యత్‌పై ఎంతో కలలతో ఇంజనీరింగ్‌లో అడుగుపెట్టిన ఇద్దరు విద్యార్థులు అసువులు బాసారు. సాగర్‌ ‌రోడ్డు హస్తినాపురం వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మద్యం మత్తులో కారు ర్యాష్‌ ‌డ్రైవింగ్‌ ‌చేస్తూ ఓ వ్యక్తి..  ద్విచక్ర వాహనాన్ని, నడిచి వెళ్తున్న మరో యువకుడిని ఢీకొట్టాడు. వీరిని వంద టర్ల వరకు ఈడ్చుకెళ్లి కారు పల్టీ కొట్టింది. ఘటనలో ద్విచక్రవాహంపై వెళ్తున్న మహావీర్‌ ఇం‌జినీరింగ్‌ ‌కాలేజీ విద్యార్థులు శివ, సందీప్‌ ‌మృతి చెందారు. రోడ్డుపై నడిచివెళ్తున్న మరో యువకుడు కూడా మృతి చెందాడు. దీంతో కారు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. డ్రైవర్‌ను తమకు అప్పగించాలని విద్యార్థులు నినాదాలు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. భారీగా పోలీసులు మోవరించడంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రమాదం చేసిన వ్యక్తిని తమకు అప్పగించాలని విద్యార్థులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
———————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *