అర్థరాత్రి నుంచి డ్రంకెన్ డ్రైవ్‌ తనిఖీలు

– కమిషనరేట్ పరిధిలో 11,98 మందిపై కేసులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 1: న్యూఇయర్ వేడుకలు నగరంలో అంబరాన్నంటాయి. చిన్నా, పెద్ద అనే తాడాలేకుండా పటాకులు కాల్చి, స్వీట్లు పంచి 2026 సంవత్స రానికి ఘన స్వాగతం పలికారు. ఆట, పాటలతో హోరెత్తించారు. ఇళ్లు, కాలనీ అంతాటా సందడి చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా నగరంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా చేపట్టారు. బుధవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు తనిఖీలు చేపట్టారు. కాగా, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1198 మందిపై కేసు నమోదు చేశారు. నిరంతర నిఘా, క్షేత్రస్థాయి సమన్వయంతో అమలు చేసిన భద్రతా చర్యల ఫలితంగా నూతన సవత్సర వేడుకలు సజావుగా సాగాయి.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *