సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురిని ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారం మేరకు మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు అమీన్‌పూర్‌లోని ఓ మార్బుల్ షాపుపై దాడి చేశారు. నిందితుల వద్ద వున్న 2.7 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి డ్రగ్స్ పెడలర్స్‌తోపాటు డ్రగ్స్‌ను అవిÖన్‌పూర్ పోలీసులకు అప్పగించారు. రాజస్థాన్‌కు చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఎవరైనా డ్రగ్స్ కొనుగోలు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



