పాడుబడ్డ పాఠశాలలో మత్తుపదార్థాల తయారీ

– దాడి చేసి పట్టుకున్న ఈగిల్‌ ‌టీమ్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 13: ‌మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్‌ ‌టీమ్‌ ‌మరో భారీ మత్తు పదార్థాల రాకెట్‌ ‌గుట్టును రట్టు చేసింది. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో  మత్తు పదార్థాల తయారీ కేంద్రంపై దాడి చేసింది. పాత పాఠశాల భవనంలో ఆల్ఫాజోలం అనే మత్తు పదార్థాన్ని తయారు చేస్తున్న ముఠాను ఈగల్‌ ‌టీమ్‌ ‌పట్టుకుంది. మత్తు మందు తరలిస్తుండగా.. నలుగురు సభ్యులతో కూడిన ముఠాను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. పాఠశాల నుంచే వీరంతా దందా కొనసాగిస్తు న్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో రూ.కోటి విలువైన 7 కిలోల అల్ఫాజోలం, అల్ఫాజోలం తయారు చేసే యంత్రాలు, ముడి సరకును స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు రూ.20 లక్షల నగదు, కల్లులో కలిపే పౌడర్‌ని కూడా సీజ్‌ ‌చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *