హైదరాబాద్, జులై 15: మల్నాడు రెస్టారెంట్‌లోని డ్రగ్స్ పార్టీ కేసులో మరో పోలీసు అధికారి కుమారుడు అరెస్ట్ అయ్యారు. సైబరాబాద్ ఏఆర్ డీసీపీ కుమారుడు మోహన్‌ను ఈగల్ టీమ్ అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో ఇంటలిజెన్స్ ఏఎస్పీ వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజా కూడా అరెస్టయ్యారు. ప్రస్తుతం మోహన్, రాహుల్ తేజా, హర్ష, మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యతోపాటు పలువురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ కేసులో ఇంటెలిజెన్స్ ఏఎస్‌పీ వేణుగోపాల్ కుమారుడి పాత్ర ఉన్నట్లు గుర్తించిన ఈగల్ టీం అతడిని అరెస్టు చేసింది. రెస్టారెంట్ యజమాని సూర్యతో కలిసి రాహుల్ డ్రగ్స్ బిజినెస్ చేసినట్లు విచారణలో బయటపడిరది. నిజామాబాద్‌లో గత నెలలో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులో రాహుల్ సూత్రధారిగా ఉన్నాడు. ఆ కేసులో రాహుల్ ఏ3గా ఉన్నప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అతడిని అరెస్టు చేయకుండా కేవలం ఎఫ్‌ఐఆర్‌లో మాత్రమే రాహుల్ పేరును చేర్చారు. ఇక మల్నాడు డ్రగ్స్ కేసుకు సంబంధించి రాహుల్, సూర్య, హర్ష కలిసి డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది.
డ్రగ్స్ కేసు.. మరో పోలీస్ అధికారి కుమారుడి అరెస్ట్



