భారీగా డ్రగ్స్‌ పట్టివేత

– పెడ్లర్లతోపాటు 8మంది ట్రాన్స్‌జెండర్ల అరెస్ట్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4: నగరంలో భారీ డ్రగ్‌ ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. డ్రగ్స్‌ సేవిస్తున్న పది మందిని ఈస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ అదుపులోకి తీసుకుంది. ఇద్దరు పెడ్లర్లతోపాటు 8మంది ట్రాన్స్‌జెండర్‌ (గే) వినియోగదారులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పెడ్లర్ల నుంచి వంద గ్రాముల ఎండీఎంఎస్‌ స్వాధీనం చేసుకున్నారు. యాప్‌ ద్వారా డ్రగ్స్‌ కొనుగోలు, అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఇందులో ట్రాన్స్‌జెండర్లు (గే) సైతం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. వీరిలో ‘గే’లకు డ్రగ్స్‌ సరఫరా చేసిన నైజీరియన్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్‌ వినయోగిస్తున్న వారి జాబితాలోల తాజాగా ‘గే‘లు సైతం చేరడం ఆందోళన కలిగిస్తోంది. డ్రగ్స్‌ నిరోధక చట్టాలను పదును తేల్చడం, శిక్షల పెంపుతోపాటు పోలీస్‌, కస్టమ్స్‌, ఎక్సైజ్‌ తదితర విభాగాల సమన్వయంతో సమష్టి కార్యాచరణ చేపడుతున్నాయి. స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడం, జాతీయ డీ-ఎడిక్షన్‌ హెల్ప్‌లైన్‌ (14446) తీసుకురావడంతోపాటు ’నశా ముక్త్‌ భారత్‌’ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. డగ్స్ర్‌ ముఠాల పనిపట్టడానికి తెలంగాణలో ప్రత్యేక విభాగం ‘ఈగల్‌’ను ఏర్పాటు చేశారు కూడా.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *