బర్త్‌ డే పార్టీలో డ్రగ్స్‌

– ఆరుగురు టెకీల అరెస్ట్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 3: డ్రగ్స్‌పై ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు, చర్యలు చేపట్టినా వాటి వాడకంలో తగ్గేదేలే అంటున్నారు కొందరు డ్రగ్స్‌ ప్రియులు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ విలాసాలకు అలవాటుపడిన కొందరు టెకీలు డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు. తాజాగా చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌ తీసుకుంటూ టెకీలు పట్టుబడడం కలకలం రేపింది. ఓ ఫామ్‌హౌస్‌లో ఐటీ ఉద్యోగులు బర్త్‌ డే పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో డ్రగ్స్‌ వినియోగిస్తున్నారన్న సమాచారంతో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ టీం ఫామ్‌ హౌస్‌లో తనిఖీలు నిర్వహించింది. రూ.2 లక్షల విలువైన డ్రగ్స్‌, ఖరీదైన మద్యాన్ని అక్కడ గుర్తించారు పోలీసులు. డ్రగ్స్‌, మద్యం బాటిళ్లతోపాటు రూ.50లక్షల విలువైన మూడు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆరుగురు ఐటీ ఉద్యోగులను అరెస్టు చేసి ఫామ్‌హౌస్‌ నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *