గుట్ట‌పై డ్రోన్ ఎగరవేత‌.. వ్యక్తిపై కేసు నమోదు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పరిధిలో కొండపైన అనుమతి లేకుండా డ్రోన్ ఎగురుతున్నట్లు గుర్తించిన ఎస్పీఎఫ్ పోలీస్ సిబ్బంది వెంటనే ఆ డ్రోన్‌ను ఎగురవేస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. అత‌డిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించ‌గా పోలీసులు కేసు నమోదు చేశారు. దేవస్థానం పరిధిలో, కొండపై ప్రాంతం నో ఫ్లయింగ్ జోన్ గా ఉన్నందున ఆయా ప్రాంతాలలో డ్రోన్‌లను ఎగరవేయడం, డ్రోన్‌ల ద్వారా షూటింగ్ చేయడం నిషేధం. దీన్ని ఉల్లంఘించిన ఆ వ్య‌క్తిని ఆల‌య సిబ్బంది పోలీసుల‌కు అప్ప‌గించిన‌ట్లు ఆలయ ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *