ఫిరాయింపు ఎమ్మెల్యేలకు త‌లుపులు మూశాం

– సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
– అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీలపై వెనకడుగు
– తెలంగాణ తెచ్చిన నేతగా కెేసీఆర్‌ను గౌరవించాలి
– విూడియా చిట్‌చాట్‌లో బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : అసెంబ్లీ శీతాకాల సమావేశాల వేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటూ కాకుండాపోయారని వ్యాఖ్యానించారు. వారు ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేకపోతున్నారన్నారు. విూడియాతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్‌ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్‌లో డోర్స్‌ క్లోజ్‌ అయ్యాయని స్పష్టం చేశారు. వారి స్థానంలో కొత్తవారికి అవకాశమిస్తామని తెలిపారు. క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్‌కు మంచి పట్టు ఉందని, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని పేర్కొన్నారు. సర్పంచ్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 40 శాతం ఫలితాలు వచ్చాయని గుర్తుచేశారు. పాలమూరు`రంగారెడ్డి విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి రంధ్రాన్వేషణ వల్ల రాష్ట్రానికే నష్టమని కేటీఆర్‌ అన్నారు. అనుమతులు దృష్టిలో ఉంచుకుని తాగునీటి పేరుతో పనులు చేశామని చెప్పారు. కేసీఆర్‌ చిత్తశుద్ధిని కాళేశ్వరం విషయంలో చూడాలన్నారు. రేవంత్‌రెడ్డి దోపిడీని అడుగడుగునా అడ్డుకుంటున్నందుకే దూషిస్తున్నారంటూ ఆయన తిట్లు నాకు దీవెనలు.. నన్ను తిడితే పడతాను కానీ.. కేసీఆర్‌ను అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆయనకు మంచి పేరు వస్తుందనే పాలమూరు`రంగారెడ్డి పనులు చేయట్లేదని, కాల్వల కోసం పిలిచిన టెండర్లను రేవంత్‌ ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. గోదావరిలో నీటి హక్కుల కోసమే కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులను కేసీఆర్‌ చేపట్టారని కేటీఆర్‌ అన్నారు. పార్టీని వదిలి వెళ్లిన నేతలను మళ్లీ తీసుకోవాల్సిన అవసరం లేదన్నది తన అభిప్రాయమని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ను కాదని బీజేపీలోకి వెళ్లిన నేతల నియోజకవర్గాల్లో ఎన్ని సర్పంచ్‌ స్థానాలు గెలిచారో చూశాం కదా! నేతల బలం లేకున్నా తమ కార్యకర్తలు సర్పంచ్‌లను గెలిపించుకున్నారని చెప్పారు. పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని న్యాయస్థానంలో పోరాడుతున్నాం.. వారితో తమకేం సంబంధం అంటూ వారి విషయంలో సీఎం మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి, సర్పంచ్‌ ఎన్నికల నాటికి పరిస్థితులు చాలా మారాయి. అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టడం లేదు. ఫైనాన్స్‌ కమిషన్‌ నిధుల కోసమే తప్పనిసరి పరిస్థితుల్లో మున్సిపల్‌ ఎన్నికలు అంటున్నారు. ప్రజల్లో ప్రభుత్వ పరిస్థితి బాగోలేదు. కడియం నా గురించి ఏం మాట్లాడతారు? వాస్తవాలు దాచలేరు కదా! పోచారం ఈ వయసులో ఏం సాధించారు? గౌరవం నిలబెట్టుకోవాలి కదా అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో పలకరించడంపై కేటీఆర్‌ స్పందించారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్‌ పట్ల రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ గౌరవం ఉందన్నారు. ముఖ్యమంత్రి సభలో కేసీఆర్‌ను కలిసేంత సంస్కారం ఉంటే చాలు.. ఇదే సంస్కారం బయట మాటల్లో ఉంటే బాగుంటుంది.. రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకుల వాతావరణం ఉంటే మంచిదేనని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *