పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వాడొద్దు

– దేవూనూరులో అవగాహన సదస్సు
– ఉన్నత్ భారత్ అభియాన్ అభివృద్ధి పథకం అమలు
– భాగస్వామ్య‌మైన న్యూసైన్స్ డిగ్రీ, పీజీ కాలేజీ

హన్మకొండ, ప్రజా తంత్ర, జనవరి 29: ఉన్నత్ భారత్ అభియాన్ (యుబిఎ) కార్యక్రమంలో భాగంగా హనుమకొండలోని న్యూ సైన్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల డైరెక్టర్లు డాక్టర్ కె.రవీందర్ రెడ్డి డాక్టర్ ఎస్.శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో దత్తత గ్రామమైన దేవూనూరులో “ప్లాస్టిక్ వద్దు-ప్రకృతి ముద్దు” అనే శీర్షికతో ప్లాస్టిక్ వినియోగం దాని దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ వలన కలిగే పర్యావరణ కాలుష్యం, ఆరోగ్య సమస్యలు భూగర్భ జలాలపై ప్రభావం వంటి అంశాలపై గ్రామస్తులకు వివరించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణహిత ప్రత్యామ్ న్యాయాలను ఉపయోగించాల్సిన అవసరాన్ని విద్యార్థులు నినాదాలు, ప్రసంగాలు, అవగాహన కార్యక్రమాల ద్వారా గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో యుబిఎ సమన్వయకర్తలు బి.రమణాదేవి, వై శ్రీధర్, ఆర్ జాషువా ముఖ్యపాత్ర పోషించగా జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ ప్రధానోపా ధ్యాయులు సునంద, గ్రామ సర్పంచ్ ఇంగే రవీందర్, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు సహకరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ రాజేశం, డాక్టర్ సిహెచ్ కమలాకర్ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర కీలకమైనదని అన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్తులలో ప్లాస్టిక్ వినియోగం పై అవగాహన పెరిగిందని, పర్యావరణ పరిరక్షణ దిశగా సానుకూల అడుగు పడినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి. మధుకర్, ఎనఎసఎస్ కోఆర్డినేటర్ గట్ల నాగరాజు ,ఐకాక్ కోఆర్డినేటర్ పి.యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *