కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవొద్దు : హై కోర్టు

కాళేశ్వరం పై  జస్టిస్ పి సీ ఘోష్  కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవొద్దని హై కోర్టు  ఆదేశించింది. అక్టోబర్ ఏడో తేదీన తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. దీంతో కేసీఆర్, హరీశ్ రావుకు భారీ ఊరట లభించినట్లయింది.కాళేశ్వరం కమిషన్ నివేదికపై సీబీఐ విచారణ జరిపించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి బ్రేక్ పడినట్లయింది . కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్న కారణంగా రాజ్యాంగబద్ధ సంస్థలు తక్షణమే చర్యలు చేపట్టే అవకాశం లేదని న్యాయశాస్త్ర నిపుణుల అభిప్రాయం. మరో వైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగాయని ..సి బి ఐ విచారణ జరపాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం  కేంద్ర హోమ్ శాఖకు లేఖ రాసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *