– డిప్యూటీ సీఎం కలిసిన ఎంజేఏ ప్రతినిధి బృందం
– ముందుగా ప్రజాస్వామ్య ప్రక్రియను పాటించాలి
– ప్రాజెక్టుపై ప్రజల్లో విస్తృత చర్చ జరగాలి
– ఎంజేఏ ప్రతినిధుల డిమాండ్
– సానుకూలంగా స్పందించిన మంత్రులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: మూసీ జన ఆందోళన్ (ఎంజేఏ)కు చెందిన 12 మందిసభ్యుల ప్రతినిధి బృందం ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని కలసింది. మూసీ రివర్‌ఫ్రంట్డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌కు సంబంధించి తమ దీర్ఘకాలిక డిమాండ్లు, ఆందోళనలను ఈ సమావేశంలో వివరించారు. ముఖ్యంగా ‘మూసీ నదిపునరుజ్జీవనం – దశ 1’కు సంబంధించి వివరమైన ప్రాజెక్ట్ ప్రణాళికలనుతొందరపాటుగా, ప్రజాస్వామ్య ప్రక్రియలకు విరుద్ధంగా విడుదల చేయడంపైతీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ముఖ్యమైన సమావేశానికి మంత్రులు డి. శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రి దశ–1కుసంబంధించిన ‘వివరమైన ప్రాజెక్ట్ ప్రణాళికలను’ విడుదల చేయడానికిఒక రోజు ముందు ఈ అత్యవసర సమావేశానికి ఉప ముఖ్యమంత్రి ఎంజేఏనుమౌఖికంగా ఆహ్వానించారు. ఈ పరిణామం ప్రముఖ సామాజిక కార్యకర్తమేధా పాట్కర్ 10 మార్చి 2026న ముఖ్యమంత్రికి రాసిన లేఖ నేపథ్యంలోజరిగింది. ఆ లేఖలో ఆమె 13 మార్చి కార్యక్రమాన్ని నిలిపివేసి, ఎంజేఏ, ఇంకాప్రభావిత ప్రజలతో విస్తృత ప్రజాస్వామ్య చర్చలు ప్రారంభించాలని కోరారు. మేధా పాట్కర్ తమ లేఖలో ప్రస్తావించిన అన్ని డిమాండ్లను ప్రతిధ్వనిస్తూ, ఎంజేఏ 13 మార్చి 2026న జరగబోయే కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలనిడిమాండ్ చేసింది. అలాగే ప్రాజెక్ట్లోని ఒక దశకు మాత్రమే కాకుండా మొత్తంప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరమైన ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) ను ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రజలకు అర్థమయ్యే విధంగా విడుదల చేయాలనికోరింది. అలాగే నది సరిహద్దులు, బఫర్ జోన్ మ్యాప్‌లను కూడా విడుదలచేసి, భాగస్వామ్య సమూహాలు అందరూ తమ సూచనలు, అభ్యంతరాలను సమర్పించేందుకు కనీసం 60 రోజుల సమయం ఇవ్వాలని కోరింది. 2025 డిసెంబర్ 16న జారీ చేసిన జి.ఒ.ఆర్‌టి.నెం.921 ఎం.ఎ&యుడి (పీఎల్‌జీ-I)ను వెంటనే ఉపసంహరించుకోవాలని బలంగా డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం ప్రాజెక్ట్ లోని అన్ని దశలకోసం 10,017 నిర్మాణాలు, 3,279 ఎకరాల భూమిని గుర్తించారు. అలాగే 2013 భూ స్వాధీన, పునరావాస మరియు పునరుద్ధరణ చట్టంలోని సామాజిక ప్రభావ అంచనా ప్రక్రియ నుంచిమొత్తం ప్రాజెక్ట్‌ను మినహాయించారు. తెలంగాణ ప్రభుత్వం2017 సవరణను రద్దు చేయాలని ఎంజేఏ డిమాండ్ చేసింది. 2026 జనవరి 23, మార్చి 11 లలో ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) నుంచి వచ్చిన అధికారిక సమాచారాన్ని ప్రస్తావిస్తూ ఇప్పటి వరకు ఎలాంటి రుణ ఆమోదం లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ మీడియాద్వారా, అసెంబ్లీలో ప్రభుత్వం కూడా ఏడీబీ నుంచి ₹4,100 కోట్లు రుణంగా పొందుతున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఆరోపించింది. హైదరాబాద్ నగర మధ్యలో ఉన్న 3,279 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం నిజంగా అవసరమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉప ముఖ్యమం త్రి భట్టి విక్రమార్క, ఐటీ & పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ప్రతినిధుల ఆందోళనలను పూర్తిగా విన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం నదిపునరుజ్జీవం మాత్రమే అని వారు తెలిపారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యప్ర క్రియకు, ప్రజల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉందని, బలవంతపు లేదా సమ్మతి లేకుండా ఎవర తరలింపు జరగదని హామీ ఇచ్చారు. సుమారు మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో సామాజిక కార్యకర్తలు, ప్రభావిత సమాజ సభ్యులతో కూడిన 12 మంది ప్రతినిధి బృందం పాల్గొన్నారు. వీరిలో కె. సజయ , వి. సంధ్య , వర్గీస్ తెక్కనాత్, సయ్యద్ బిలాల్, మీరా సంఘమిత్ర, అఖిల్ సూర్య, హైమా, అరుణ్య, మహ్మద్ ఆరిఫ్ అహ్మద్, విశాలాక్షి దేవి, ఆనంద్ తంగెళ్ల, స్టాన్లీ ఉన్నారు. మా తాజా సమాచారం తెలియజేస్తున్న ఈ సమయంలోనే, ఎంజేఏకుచెందిన సీనియర్ కార్యకర్త సయ్యద్ బిలాల్‌ను ఈ ఉదయం నుంచి అతనిఇంటి వద్దనే పోలీసులు నిర్బంధించడం బాధాకరం. పలువురు పోలీసులసమక్షంలో జరిగిన ఈ ‘హౌస్ అరెస్ట్’ను తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వం ఇలాంటి నిర్బంధ చర్యలకు పాల్పడకూడదని డిమాండ్ చేసింది.
గృహనిర్బంధాలు ఆపండి: మానవహక్కుల సంఘం
ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించిన సవివర ప్రాజెక్టు నివేదిక ప్రజంటేషన్ విడుదల చేస్తున్న నేపథ్యంలో ఎంజేఏ సంస్థ నగర కమిటి ఉపాధ్యక్షుడు, మూసీ బస్తీ ప్రజల హక్కుల కోసం పనిచేస్తున్న సయ్యద్ బిలాల్ పై గృహనిర్భందం విధించటాన్ని తమ సంస్థ తీవ్రంగా ఖండిస్తున్నదని మానవ హక్కుల వేదిక నాయకులు డా.తిరుపతయ్య, ఎస్.జీవన్ కుమార్, ఎం.సురేష్ బాబు, సంజీవ్ లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విడుదల చేయబోయే నివేదికను పౌరలందరికీ అందుబాటులో ఉంచాలని, అసలు ఈ మూసీ ప్రొజెక్టు ఆవశ్యకతపై నగర ప్రజల అభిప్రాయం తీసుకోవాలని తమతో పాటు, ఇతర అనేక సామాజిక సంస్థలు, కార్యకర్తలు, మేధావులు, ప్రభుత్వాన్ని ఈ ప్రాజెక్టు ప్రతిపాదన దశ నుండే అడుగుతున్నారన్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ నిర్మాణం పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిరాశ్రయులను చేయవద్దని, ఆ ప్రాజెక్ట్ ను విరమించుకోమని ప్రముఖ సామజిక కార్యకర్త మేధా పాట్కర్ ముఖ్యమంత్రికి లేఖ కూడా రాసిన సంగతిని గుర్తుచేశారు. ప్రభుత్వం మూసీ నదిని శుభ్రం చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. మానవ హక్కుల కార్యకర్త సయ్యద్ బిలాల్ , ఇతర సామాజిక కార్యకర్తలపై గృహ నిర్బంధం లాంటి విధానాలకు పాల్పడకుండా, ప్రజల, సామాజిక కార్యకర్తల, మేధావుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ, సామాన్య ప్రజల నివాస హక్కులను గౌరవిస్తూ మూసీ నదిని శుభ్రం చేసే ప్రాజెక్ట్ ను చేపట్టాలని, గాంధీ సరోవర్ ను ఇదివరకే ఉన్న బాపు ఘాట్ ప్రాంగణంకు పరిమితమై మాత్రమే నిర్మించాలని మానవహక్కుల సంఘం డిమాండ్ చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



