బంగ్లా ఘటనలతో క్రికెట్‌కు ముడిపెట్టవద్దు

– అలా అయితే హసీనాను వెనక్కి పంపండి
– ఎంఐఎం అధినేత ఓవైసీ డిమాండ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరిత్: బంగ్లాదేశ్ లో హిందువులపై మారణకాండలు జరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కోల్క‌తా నైట్ రైడర్స్ నుంచి ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను రిలీవ్ చేయాలని దాని సహ యజమాని బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కు ఆదేశాలు జారీ చేసింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొంతమంది రాజకీయ నాయకులు తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ రాజకీయాలను, క్రీడలను కలపొద్దని హితవు పలికారు. ఇప్పుడు ఎమ్ఎమ్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ రెహ్మాన్ కు మద్దతుగా నిలిచారు. ఓవైసీ మాట్లాడుతూ ‘పహల్గామ్ దాడి తర్వాత మనం పాకిస్థాన్ తో ఏషియా కప్ ఆడాము. మీరు బంగ్లాదేశ్ పేసర్ ను వెనక్కు పంపించేశారు. ఓ బంగ్లాదేశీ మహిళ ఇండియాలో నివసిస్తోంది. ఆమెను కూడా వెనక్కు పంపండి. ఎందుకు ఆమెను ఇండియాలోనే నిలిపివేశారు? బంగ్లాదేశ్ లో స్థిరత్వం ఇండియాకు ముఖ్యం. చైనా, పాకిస్థాన్ బంగ్లాదేశ్ లో యాక్టీవ్ ఉన్నాయి. మనం దాని గురించి కూడా బాగా ఆలోచించాలి’ అని అన్నారు. కాగా, బంగ్లాదేశ్ లో 2024 జులై, ఆగస్టు నెలల్లో జరిగిన మారణహోమానికి కారణం అప్పటి ప్రధాని షేక్ హసీనానేనంటూ ఆమెను ఇంటర్నేషనల్ కైమ్ ట్రిబ్యునల్-1 దోషిగా తేల్చింది. హసీనాకు మరణ శిక్ష విధించింది. హసీనాకు మరణ శిక్ష వేయడాన్ని ఆమె కుటుంబసభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇంతకు తెగించారని మండిపడ్డారు. తన తల్లి ఇండియాలో క్షేమంగా ఉంటుందని ఆమె కుమారుడు సజీబ్ వాజెడ్ జోయ్ స్పష్టం చేశాడు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *