అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు

– జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ సూచనలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని, సాయంత్రం నుండి అధిక వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల నేపథ్యంలో హై అలెర్ట్‌గా ఉన్నామని,. ఉద్యోగుల సెలవులు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఉన్నతాధికారులను హెడ్‌ క్వార్టర్‌లో ఉండాలని ఆదేశించామన్నారు. సహాయక కార్యకలాపాలను డిప్యూటీ కమిషనర్‌, స్థానిక తహసీల్దార్లు చూసుకుంటున్నారన్నారు. జీహెచ్‌ఎంసీకి కంట్రోల్‌ రూమ్‌, మీడియా ద్వారా వచ్చే ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందిస్తున్నామని తెలిపారు. మ్యాన్‌ హోల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దు. వాటిపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే కంట్రోల్‌ రూమ్‌కు ఆయా విభాగాల అధికారులు, ప్రజలు తెలియజేయాలని సూచించారు. ట్రాఫిక్‌ చోకింగ్‌ పాయింట్లపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టామని, ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా పోలీస్‌, హైడ్రాతో సమన్వయం చేసుకుంటున్నామని ఆ ప్రకటనలో వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *