– రమణపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్న
– శాంతిభద్రతలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
– మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు
పటాన్ చెరు,ప్రజాతంత్ర,జనవరి 26: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ జిహెచ్ఎంసి పరిధిలోని నైబర్ హుడ్ అసోసియేషన్ అధ్యక్షులు రమణను మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పరామర్శించారు. తెల్లాపూర్ లోని మై ఫేర్ కు వెళ్లే దారిలో నిబంధనలను అతిక్రమించి ఎలాంటి పర్మిషన్ లేకుండా నిర్మిస్తున్న ఓ వర్గానికి చెందిన చిల్ల కట్టడంపై నైబర్ హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణను ఓ వర్గానికి చెందినవారు దాడి చేయడం జరిగిందని వారు తెలిపారు. సోమవారం సాయంత్రం రమణకు, కాలనీల వాసులకు ఎంపీ రఘునందన్ రావు మద్దతుగా నిలిచారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గ్రేటర్ కమ్యూనిటీలలో ఈ ప్రాంతంలో చాలామంది ఎంతో డబ్బును వెచ్చించి ప్లాట్లు కొనుక్కొని ఆనందంగా ఉందామనుకుంటున్నారని తెలిపారు. పెద్ద పెద్ద కంపెనీలు నిర్మాణాలు నిర్మిస్తూ ఓ పక్క పొల్యూషన్, మరోపక్క ఆర్ఎంసి వాహనాలతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలలో రోహింగ్యాలు ఎంతమంది, ఏ దేశస్తులు, వీరికి కనీసం ఆధార్ కార్డు అయినా ఉందా అని చెక్ చేయకుండా ఇక్కడ పోలీసుల వ్యవహార శైలిని తప్పుపట్టారు. కట్టడాన్ని వ్యతిరేకిస్తున్న క్రమంలో రమణపై జరిగిన దాడిని స్థానిక పోలీసులు ప్రత్యర్థులపై కేసు నమోదు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. జరుగుతున్న కట్టడం రోడ్డుపైకి వస్తే భవిష్యత్తులో దాన్ని తొలగించడం ఒక పెద్ద పంచాయితీ పెట్టాల్సి వస్తదని, ఇప్పుడే దాన్ని కట్టడి చేయాలని హితవు పలికారు. కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బంది కలిగిన అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎంతటి వారైనా సరే తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రశాంత వాతావరణమును చెడగొడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో పూర్తిగా విఫలమైంది ధ్వజమెత్తారు. రమణపై దాడి చేసిన వ్యక్తులు ఉన్న వెంటనే అరెస్ట్ చేయాలని, లేనిపక్షంలో కాలనీల ప్రజలందరితో కలిసి కార్యచరణ ప్రకటిస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నైబర్ హుడ్ అసోసియేషన్ అధ్యక్షులు రమణ, తెల్లాపూర్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు రాంబాబు గౌడ్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి, వివిధ కాలనీలకు చెందిన అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





