స్పీకర్‌ను డిక్టేట్ చేయొద్దు

– బీఆర్ఎస్ సభ్యులకు మంత్రి దుద్దిళ్ల హితవు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: సభను ఎలా నడపాలో స్పీకర్‌ను డిక్టేట్ చేయాలని బీఆర్ఎస్ సభ్యులు చూడటం మంచి పద్ధతి కాదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హితవు పలికారు. అధికార పక్షంలో ఉన్నప్పుడు బుల్డోజ్ చేశారు.. ఇప్పుడూ అలాగే చేయాలనుకుంటే ఎలా అని ప్రశ్నించారు. బుధవారం శాసనసభలో మంత్రులు బిల్లులు పెట్టే సమయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన బీఆర్ఎస్ సభ్యుల తీరుపై ఆయన ఘాటుగా స్పందించారు. ఆ పార్టీ శాసనసభా నాయకుడిగా ఎన్నికయ్యేందుకు హరీశ్ రావుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. ఆ పదవికి ఆయన సమర్ధుడని కితాబు ఇచ్చారు. డిప్యూటీ లీడర్‌గా ఆయన కోరినప్పుడల్లా మైక్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. లెజిస్లేచర్ పార్టీ లీడర్ స్థానంలో కూర్చుంటే ఎప్పుడంటే అప్పుడు మాట్లాడటానికి అవకాశం ఉంటుందని హరీశ్‌రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *