– సౌకర్యాల కల్పనపై మంత్రి దామోదర్ ఆదేశాలు
– సనత్‌నగర్ టిమ్స్ ను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: ఉగాది నాటికి అన్ని సౌకర్యాలతో సనత్‌నగర్ టిమ్స్‌ను సిద్ధం చేయాలని, పేదలకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా పనిచేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. హాస్పిటల్‌కు నీళ్లు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకం ఉండకూడదని, 24 గంటల సరఫరా ఉండాలని పేర్కొన్నారు. ఫైర్ సేఫ్టీ విషయంలో రాజీ ఉండకూడదని, అన్ని ఫ్లోర్లలో పూర్తిస్థాయి పరిశీలన చేయాలని అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు. సనత్‌నగర్ టిమ్స్ పనులను మంగళవారం పరిశీలించి మెడికల్, ఫైర్, పొల్యూషన్ కంట్రోల్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఆర్ అండ్ బీ తదితర శాఖల ఉనతాధికారులతో టిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు. రిసెప్షన్ ఏరియా, హెల్ప్ డెస్క్, ఓపీ కౌంటర్లు, వెయిటింగ్ హాల్, ఓపీ కన్సల్టేషన్ రూమ్స్, డయాగ్నస్టిక్స్, ఇన్ పేషెంట్ వార్డులు, ఫార్మసీ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా ఓపీ, ఫార్మసీ కౌంటర్లు ఉండాలని అధికారులకు సూచించారు. సీటీ స్కాన్, ఎంఆరఐ, ఎక్స్‌రే, ఆల్ట్రాసౌండ్ తదితర యంత్రాలను పరిశీలించిన మంత్రి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ యంత్రాలు పూర్తిస్థాయిలో రోగులక” ఉపయోగపడాలని, ఇందుకు అవసరమైన డాక్టర్లు, ఇతర సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి, వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు జేఎండీ మయాంక్ మిట్టల్, డీఎంఈ నరేంద్ర కుమార్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





