హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: రాష్ట్రంలోని మహిళల రక్షణ, భద్రత కోసం సేవలందిస్తున్న పోలీసు శాఖలోని మహిళా భద్రతా విభాగానికి(ఉమెన్ సేఫ్టీ వింగ్) విరాళం అందింది. తార్నాక మహిళా సమాజం తరపున విజయలక్ష్మి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డిని శుక్రవారం కలిసిన ఆమె విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చేపడుతున్న కార్యక్రమాలకు తమవంతు మద్దతుగా ఈ మొత్తాన్ని అందజేస్తున్నట్లు విజయలక్ష్మి తెలిపారు. సామాజిక బాధ్యతతో తార్నాక మహిళా సమాజం ముందుకు వచ్చి భారీ విరాళాన్ని అందించడం పట్ల డీజీపీ హర్షం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



