– పోరాటంలో ఆయన పాత్ర కీలకమైనది
– గ్రంథాలయ ఉద్యమంలో చురుకైన పాత్ర
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్, సీపీఐ నేత నారాయణ సంతాపంహైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 12: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, సిపిఐ ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ కార్యదర్శి దొడ్డ నారాయణరావు (96) శుక్రవారం రాత్రి ఆయన స్వగృహంలో కన్ముమూశారు. ఆయన భార్య సక్కుబాయి అనారోగ్యంతో గత ఏడాది ఆగస్టులో మృతిచెందారు. ఆయన మృతిపట్ల సీపీఐ సీనియర్ నేత నారాయణ సంతాపం ప్రకటించారు. మహోన్నత వ్యక్తి దొడ్డా నారాయణరావు అని కొనియాడారు. కాగా, ఆయన మృతిపట్ల నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం ప్రకటించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆయన అందించిన సేవలు అనిర్వచనీయమైన ఘట్టంగా మిగిలిపోతాయన్నారు. గ్రంథాలయ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర వర్తమాననికి స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతుందన్నారు సర్పంచ్‌గా, పీఏసీఎస్ చైర్మన్‌గా ఎంపీపీగా జనబాహుళ్యానికి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఆయన కొనియాడారు అలాంటి నేత మన మధ్య లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ఉత్తవమ్‌కుమార్ తెలిపారు.





