డాక్టర్ల సమస్యలను పరిష్కరిస్తాం

– మంత్రి దామోదర హామీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: అసోసియేట్‌ ప్రొఫెసర్స్‌ నుండి ప్రొఫెసర్స్‌గా పదోన్నతులు కల్పించినందుకు డాక్టర్ల సంఘం ప్రతినిధులు మంత్రి దామోదర్‌ రాజనర్సింహకు శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. టీజీజీడీఏ డాక్టర్ల సంఘం ప్రతినిధులతో సంగారెడ్డిలోని తన నివాసంలో మంత్రి దామోదర్‌ రాజనర్సింహ సమావేశమయ్యారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 1690 డాక్టర్‌ పోస్టుల భర్తీకి మంత్రి సానుకూలంగా స్పందించారు. డాక్టర్ల పోస్టుల భర్తీకీ తెలంగాణ మెడికల్‌ బోర్డు త్వరగా విధివిధానాలు రూపొందించాలని మంత్రి దామోదర్‌ ఆదేశించారు.డాక్టర్ల ఉద్యోగాల భర్తీలో వయోపరిమితి పెంపు పై నిబంధనలు రూపొందించటానికి కమిటీని నియమిస్తామన్నారు. టీవీవీపీ లో క్యాడర్‌ స్ట్రెంత్‌ పెంపు పై కమిషనర్‌ డా . అజయ్‌ కుమార్‌ తో మంత్రి చర్చించారు. డాక్టర్ల సమస్యల పై అసోసియేషన్‌ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తి పై మంత్రి దామోదర్‌ రాజనర్సింహా సానుకూలంగా స్పందించారు .ఈ సమావేశం లో తెలంగాణ గవర్నమెంట్‌ డాక్టర్ల అసోసియేషన్‌ (టీజీడీఏ) అధ్యక్షులు డాక్టర్‌ నరహరి , సెక్రెటరి జనరల్‌ డాక్టర్‌ లాలు ప్రసాద్‌, డాక్టర్‌ రాహుఫ్‌ , డాక్టర్‌ వినయ్‌ కుమార్‌ , డాక్టర్‌ గోపాల్‌ , డాక్టర్‌ క్రాంతి , డాక్టర్‌ అశోక్‌ , డాక్టర్‌ రామ్‌ సింగ్‌ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *