కిట్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ నిర్మలాదేవికి డాక్టరేట్‌

వరంగల్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: వరంగల్‌లోని కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (కిట్స్‌డబ్ల్యూ)లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ (ఈసీఐఈ) విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రంగిశెట్టి నిర్మలాదేవికి జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ, హైదరాబాద్‌(జేఎన్‌టీయూహెచ్‌) పీహెచ్‌డీని ప్రదానం చేసింది, ఈ సందర్భంగా కిట్స్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.అశోక రెడ్డి మాట్లాడుతూ నిర్మలాదేవి డిస్పర్సివ్‌ సీడీఎంఏ ఛానెల్స్‌లో బ్లైండ్‌ ఈక్వలైజేషన్‌, మల్టీ యూజర్‌ డిటెక్షన్‌ సిస్టమ్స్‌ విశ్లేషణ, పనితీరు అనే తన పీహెచడీ థీసిస్‌ను సమర్పించారని వివరించారు. ఆమె తన పరిశోధనను వరంగల్‌ నిట్‌ ఈసీఈ విభాగం రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.కిషన్‌ రావు పర్యవేక్షణలో చేశారన్నారు. భవిష్యత్‌ తరాల అవసరాలను తీర్చడానికి ఈ డీఎస్‌-సీడీఎంఏ పనితీరును మెరుగుపరచడానికి నిర్మలాదేవి టెన్సర్‌-ఆధారిత సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, నిర్మాణాత్మక కోడ్‌ డిజైన్‌ను అభివృద్ధి చేశారని తెలిపారు. కళాశాల యాజమాన్యం, రాజ్య్ణసభ మాజీ సభ్యుడు, కళాశాల చైర్మన్‌ కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు, కోశాధికారి పి.నారాయణ రెడ్డి, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే, కిట్స్‌ అదనపు కార్యదర్శి వొడితల సతీష్‌ కుమార్‌లు నిర్మలా దేవిని అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం.కోమల్‌ రెడ్డి, డీన్‌ అకడమిక్‌ అఫైర్స్‌ ప్రొఫెసర్‌ కె.వేణుమాధవ్‌, ఈసీఐఈ హెడ్‌ డాక్టర్‌ కె.శివాని, డీన్లు, అన్ని విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, కెమిస్ట్రీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అండ్‌ పీఆర్‌వో డాక్టర్‌ డి.ప్రభాకరాచారిలు నిర్మలాదేవిని అభినందించి మిఠాయిలు పంచుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *