ఆఫ్రికా పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

– రాష్ట్రపతితో వెళ్లనున్న డీకే అరుణ

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబర్‌ 8: ఆఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తోపాటు మహబూబ్‌నగర్‌ బీజేపీ ఎంపీ డీకే అరుణ వెళ్తున్నారు. భారత ప్రతినిధి బృందంలో సభ్యురాలిగా ఆమె ఈ పర్యటనకు ఎంపికయ్యారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే ఈ కీలక పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాణిజ్యం, వ్యవసాయం, సాంకేతికత, సాంస్కృతిక మార్పిడి వంటి కీలక రంగాల్లో భారత్‌, ఆఫ్రికా దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడంపై ప్రధానంగా చర్చలు జరపనున్నారు. తెలంగాణ మహిళా నాయకత్వాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టేందుకు ఇదొక గొప్ప అవకాశంగా అరుణ భావిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి, మహిళల పురోగతి, రైతుల సంక్షేమం కోసం ఆమె చేసిన సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడిరది. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ ప్రపంచ ప్రగతిలో తెలంగాణ పాత్రను మరింత బలంగా నిలబెట్టడమే నా లక్ష్యం. ఈ పర్యటన ద్వారా మహిళలు, రైతులు, యువతకు ఉపయోగపడే అవకాశాలను మన రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తాను తెలిపారు. ఈ పర్యటనతో భారత్‌-ఆఫ్రికా సంబంధాలు కొత్త దిశగా పయనిస్తాయని, అదే సమయంలో తెలంగాణ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా ఇనుమడిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *