జిల్లాస్థాయి కమిటీలను వారంలో పూర్తి చేయాలి

– సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: జిల్లాస్థాయి అక్రెడిటేషన్ కమిటీలను వారం రోజులలో పూర్తి చేయాలని డీపీఆర్వోలను సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. శుక్రవారం నాంపల్లిలోని తెలగాంణ మీడియా అకాడమీ ఆడిటో రియంలో అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ విధి విధానాలపై డీపీఆర్వోలకు, క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీఓ నెం.252, 103లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పీఆర్వోలకు సూచించారు. జిల్లాస్థాయి అక్రెడిటేషన్ కమిటీలను సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రతినిధులతో ఒక కమిటీని వారంలో పూర్తి చేయాలని ఆమె వెల్లడించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా, ఫ్రీలాన్స్, వెటరన్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల నమోదు, దరఖాస్తుల పరిశీలన, రిపోర్టులు, అపూపూడ్ లిస్టులు, రిజిస్ట్రేషన్ నెంబర్ అలాట్ మెంట్, అక్రెడిటేషన్ కార్డుల డౌన్ లోడింగ్, మొదలగు అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆమె సంబంధిత అధికారులను కోరారు. అదే విధంగా అక్రెడిటేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా ఆన్ లైన్, ఇతర సమస్యలు తలెత్తితే వెంటనే రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మీడియా రిలేషన్ వింగ్ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలన్నారు. సాంకేతిక సమస్యలు ఉంటే టెక్నికల్ టీమ్ ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంటారని వారిని కూడా సంప్రదించి ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా అక్రెడిటేషన్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆమె కోరారు. ఈ శిక్షణ కార్యక్రమానికి రాష్ట్రంలోని 33 జిల్లాల డీపీఆర్వోలు, సంబంధిత సిబ్బంది హాజరయ్యారు. శిక్షణలో భాగంగా క్షేత్రస్థాయి అధికారులకు అక్రెడిటేషన్ కార్డుల జారీపై ఆన్ లైన్ విధి విధానాలపై క్షేత్రస్థాయి సిబ్బందికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. శిక్షణలో భాగంగా క్షేత్రస్థాయి సిబ్బంది లేవనెత్తన అంశాలపై మీడియా రిలేషన్ విభాగం అధికారులు డీ.ఎస్.జగన్, యామిని, వెబ్ సైట్ టీమ్ మేనేజర్ నంద, టెక్నిషన్ సాయిలు అధికారుల సందేహాలను నివృత్తి చేశారు. అర్హత గల జర్నలిస్టులు http://ipr.te-langana.gov.in ద్వారా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఏమైనా సందేహాలు ఉంటే సెల్ నెం.9154170881ను సంప్రదించాలని తెలియజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *