*కేసీఆర్ కు మంచి పేరు వొస్తుందనే రేవంత్ సర్కార్ కిట్లను ఇవ్వడం లేదు*
*కేసీఆర్ కిట్ లతో మాతాశిశు మరణాలు తగ్గి ప్రభుత్వ హాస్పిటల్స్ ల్లో ప్రసవాలు పెరిగాయి
కెసిఆర్ కు మంచి పేరు వొస్తుందన్న ఉక్రోశంతోనే రేవంత్ ప్రభుత్వం కెసిఆర్ కిట్లను ఇవ్వడం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లతో మాత శిశు మరణాలు గణనీయంగా తగ్గి ప్రభుత్వ హాస్పిటల్స్ ల్లో ప్రసవాలు పెరిగాయన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ కిట్లను ఇస్తానని ప్రకటించిన కేటీఆర్, Gift a smile లో భాగంగా హైదరాబాద్ కు చెందిన తల్లి బిడ్డలకు తెలంగాణ భవన్ లో కేసీఆర్ కిట్లను అందించారు. గత 20 నెలల నుంచి కేసీఆర్ కిట్లను ఇవ్వకపోవడంతో చాలా మంది తల్లులు బాధపడుతున్నారని కేటీఆర్ చెప్పారు. అందుకే తన పుట్టిన రోజు సందర్భంగా 5 వేల మంది తల్లులకు సిరిసిల్లలో కేసీఆర్ కిట్లను ఇవ్వనున్నట్లు తెలిపారు. 2014 కు ముందు నేను రాను బిడ్డో సర్కారు దవఖానకు అని జనాలు భయపడేవారన్న కేటీఆర్, ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న చర్యలతో సర్కార్ దవాఖానాకే పోవాలని జనాలంతా అనుకున్నారని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల రూపురేఖలను మార్చిన కేసీఆర్ కిట్లను గత 20 నెలల నుంచి రేవంత్ సర్కార్ ఇవ్వకపోవడం దుర్మార్గం అన్నారు. కేసీఆర్ మీద ఉన్న అంతులేని ద్వేషం,కోపమే ఇందుకు కారణమని విమర్శించారు.





