– దుండుగుల చర్యలపై సీపీ ఆగ్రహం
– తక్షణ చర్యలకు సజ్జన్నార్ ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : శివరాత్రి పర్వదినం వేళ గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. దేవాలయం వద్ద శివునికి గంజాయిని ప్రసాదంగా సమర్పించబోయారు కొందరు ప్రబుద్ధులు. అంతేకాదు.. దీనిని వీడియో తీసి సోషల్ డియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు.. సదరు వ్యక్తుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయాన్ని నేరుగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కి దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించిన సీపీ సజ్జనార్ వీడియోలోని వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు గంజాయి బ్యాచ్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్‌లోని శంషాబాద్ ధర్మగిరి దేవాలయం వద్ద మహా శివునికి గంజాయిని ప్రసాదంగా పెడుతున్నామంటూ కొందరు యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దేవుడికి అందరూ కొబ్బరికాయ కొడితే తాము ప్రత్యేకంగా గంజాయి పెడుతున్నామంటూ వీడియోలో వివరించారు. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు నగర సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో వీడియోను పరిశీలించి సదరు యువకులు బడంగ్‌పేట్‌కు చెందిన చరణ్‌తోపాటు అతడి స్నేహితులుగా పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ తరహా రీల్స్ పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యువకులను సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




