కేయాన్స్ ప‌రిశ్ర‌మ‌పై అవాస్త‌వాలు ప్ర‌చారం

కేంద్రం, గుజ‌రాత్‌లు అధిక స‌బ్సిడీలు ఇచ్చాయి
ఇది కె.టి.ఆర్‌.కు తెలుసు
త‌ప్పుడు ప్ర‌చారం చేయొద్దు
ఐ.టి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 19: కేయెన్స్ సెమీ కండక్టర్ పరిశ్రమ (Keynes industry) హైదరాబాద్ నుంచి గుజరాత్ తరలిపోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని బీఆరెస్ నేత కేటీఆర్ (KTR) ఆరోపించడం బట్టకాల్చి మీద వేయడం లాంటిదే. నిరాధార, అసత్య ప్రచారాలు చేయడం అయనకు అలవాటేన‌ని ఐ.టి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు (Minister Sridhar Babu) అన్నారు. కేయెన్స్ ఇక్కడి నుంచి వెళ్లిపోయిందనడం కంటే కేంద్రం, గుజరాత్ లోని బిజెపి ప్రభుత్వాలు భారీ సబ్సిడీలు కుమ్మరించి లాక్కుపోయాయని చెప్పడం సబబుగా ఉంటుంద‌న్నారు. ఇది కేటీఆర్కీ తెలుసు. తెలంగాణా ప్రజలను మభ్యపెట్టడానికి ఇలాంటి ఆరోపణలు చేయ‌డం త‌గ‌ద‌న్నారు.

ప్రజలను గాలికొదిలి వదిలి హైదరాబాద్ లో కూర్చుని రోజూ ఏదో ఒక అంశంపై గోబెల్స్ ప్రచారం చేయడం గులాబి పార్టీ నాయకులకు అలవాటేన‌న్నారు. గుజరాత్ లోని సనంద్ లో కేయెన్స్ సెమీకాన్ ఏర్పాటు చేస్తున్న పరిశ్రమకు ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్’ (ఐఎస్ ఎం) కింద ప్రాజెక్ట్ వ్యయంలో 50 శాతం సబ్సిడీ అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింద‌న్నారు. రూ.76,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ను నెలకొల్పిన విషయం తెలిసిందే. గుజరాత్ లో ఏర్పాటు చేస్తే దీనికింది 50శాతం సబ్సిడీ వస్తుందనే ప్రచారం మొదలు పెట్టడంతో సహజంగానే సెమీకండక్టర్ పరిశ్రమలు ఆ రాష్ట్రం వైపు చూస్తాయి. కేయెన్స్ ప్రతిపాదిత ప్రాజెక్టు వ్యయం రూ. 3,307 కోట్లు అయితే ఇందులో సెంబ్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కింద రూ. 16534.5 కోట్లు ఉదారంగా లభిస్తాయి.

గుజరాత్ ప్రభుత్వం ప్రోత్సాహకాల కింద కేంద్రం ఇచ్చే సబ్సిడీలో 40 శాతం అంటే మరో రూ.661 కోట్లు అందజేస్తుంది. ప్రాజెక్టు వ్యయంపై మొత్తం సబ్సిడీ 70 శాతం. రూ. 2,314.9 కోట్లతో సమానం. తెలంగాణాలో ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ పాలసీ ప్రకారం రూ.330 కోట్లు రాయితీలు లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 50 శాతం సబ్సిడీ ఇవ్వాల్సి ఉన్నా ఇతర రాష్ట్రాల విషయంలో అంత ఉదారత చూపించదన్నారు. గుజరాత్ అయితే కేంద్ర సబ్సిడీ విషయం ఆ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందనే ప్రచారాన్ని సెమీకండక్టర్ పరిశ్రమలు సహజంగానే విశ్వసిస్తాయి. ఈ సవతి తల్లి ప్రేమ గురించి బిజెపిని విమర్శించే ధైర్యం లేకనే బీఆరెస్ రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తోంద‌న్నారు. గుజరాత్ లో నెలకొల్పే సెమీకండక్టర్ పరిశ్రమలకు ఇస్తున్న రాయితీలు చూస్తే ఒక్క ఉద్యోగానికి రూ.3.2 కోట్ల సబ్సిడీలు లభిస్తున్నాయని సాక్షాత్తు కేంద్ర మంత్రి హెచ్ డి కుమారస్వామి పేర్కొన్న విషయం తెలిసిందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *