విద్యా క‌మిష‌న్ నివేదిక‌పై మూడు నెల‌లు చ‌ర్చించాలి

– త‌ర్వాత‌నే తుదిరూపం ఇవ్వాలి
– విద్యా ప‌రిర‌క్ష‌క క‌మిటీ డిమాండ్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 4: విద్యా క‌మిష‌న్ గ‌త నెల‌ 26న ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించిన నివేదిక‌ను క‌నీసం మూడు నెల‌ల‌పాటు ప్ర‌జ‌ల ముందు చ‌ర్చ‌కు వుంచి తర్వాత తుదిరూపం ఇవ్వాల‌ని విద్యా ప‌రిర‌క్ష‌క క‌మిటీ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు ప్రొఫెస‌ర్‌ కె.చ‌క్ర‌ధ‌ర‌రావు, ప్రొఫెస‌ర్‌ జి.హ‌ర‌గోపాల్‌, ప్రొఫెస‌ర్‌ కె.ల‌క్ష్మీనారాయ‌ణలు ఒక ప్ర‌క‌ట‌న‌లో ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. 1986లో జాతీయ విద్యావిధానాన్ని ప్ర‌వేశపెట్టిన‌ప్పుడు కూడా విద్యారంగంలో స‌వాళ్లు పేరుతో విద్యావేత్తలు, త‌ల్లిదండ్రులు, అధ్యాప‌కులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల‌నుంచి స‌ల‌హాలు కోరార‌ని, దీనిపై రెండేళ్ల‌పాటు చ‌ర్చ జ‌రిగిన త‌ర్వాత‌ ఆ విద్యావిధానానికి తుదిరూపం ఇచ్చిన సంగ‌తిని వారు గుర్తుచేశారు. అంతేకాదు వివిధ వ‌ర్గాల అభిప్రాయాల‌ను బుక్‌లెట్స్ రూపంలో అప్ప‌టి ప్ర‌భుత్వం ప్ర‌చురించిన సంగ‌తిని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ప్ర‌భుత్వం చ‌ర్చ‌కు పెట్టి అంద‌రి అభిప్రాయాలు సేక‌రించిన త‌ర్వాత మాత్ర‌మే తుది రూపం ఇవ్వాల‌ని వారు స్ప‌ష్టం చేశారు.
——————————————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *