– సోషల్ మీడియా వార్తలపై కేంద్ర మంత్రి నిర్మల అసహనం
న్యూదిల్లీ, ఫిబ్రవరి 2: ఏటా బడ్జెట్ వేళ ఆర్థిక కేటాయింపులపైనే కాకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించే చీరలపైనా అందరి దృష్టి ఉంటుంది. ఎందుకంటే ఆమె చేనేతకు సంబంధించిన ప్రత్యేక చీరలను ధరిస్తారు. ఎంతో హుందాగా దర్శనమిస్తారు. ఈ సందర్భంగా ఏటా ఆమె ధరించే చీరలపై చర్చ సాగుతూనే ఉంటుంది. దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ఆమె ఎంచుకునే చీరలపైనా చర్చలు జరుగుతాయి. బడ్జెట్ సమయంలో తన చీరలపై జరుగుతోన్న చర్చలపై ఆర్థికమంత్రి అసహనం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం బడ్జెట్ రోజు నేను ఏం ధరించబోతున్నా ననే ప్రశ్నలు నాకు ఒత్తిడిగా మారుతున్నాయన్నారు. ’ఎందుకు ఇలా ప్రశ్నలతో వేధిస్తున్నారు.. ఒకవేళ బ్జడెట్ ప్రవేశపెట్టేది పురుష మంత్రులైతే వారిని కూడా ఇలాగే వారి దుస్తుల గురించి అడిగేవారా.. నేను ధరించే చీరను కూడా బ్జడెట్‌లో ఒక అంశంలా మార్చేస్తున్నారు’ అంటూ సీతారామన్ ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో ఉన్న అంశాలు ఏమిటి అనే విషయాలను తెలుసుకోవడంపై ప్రజలు దృష్టి పెట్టాలని, తన చీరలపై కాదని ఆర్థిక మంత్రి చురకలంటించారు. ఇలాంటి అనవసర విషయాల గురించి ఆలోచించడం వల్ల ముఖ్యమైన విషయాలపై పట్టు కోల్పోతామన్నారు. కాగా, ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ వేళ ఆమె కాంచీపురం చీరలో కనిపించారు. బంగారు, కాఫీ వర్ణం అంచుతో ఉన్న మెజెంటా రంగు చీర, గోల్డెన్ కలర్ బ్లౌజ్, శాలువాతో కనిపించారు. అది తమిళనాడు నేపథ్యం ఉన్న చీర. కొన్ని నెలల్లో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆమె కాంచీపురం చీరను ఎంచుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై నెట్టింట చర్చ జరుగుతోన్న సమయంలో నిర్మలా సీతారామన్ పై విధంగా స్పందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



