– అలాంటిదేమీ లేదని ఖండించిన ట్రాఫిక్ విభాగం
హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబ 4: ట్రాఫిక్ చలాన్లపై భారీ తగ్గింపుల పేరుతో తిరుగుతున్న ఈ ప్రచారం మొత్తం ఫేక్ అని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. పెండింగ్ చలాన్లు క్లియర్ చేసేందుకు ఇది మంచి అవకాశం అనుకుంటున్న వాహనదారులు అసత్య సమాచారానికి గురికావద్దని విజ్ఞప్తి చేశారు.ఇటీవలి రోజుల్లో ఇంటర్నెట్‌లో డిసెంబర్ 13న చలాన్లపై పూర్తి రాయితీలు ఇస్తున్నారంటూ వేగంగా ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ద్వారా స్పష్టతనిచ్చారు. ఆ తేదీన ఎలాంటి లోక్ అదాలత్ నిర్వహించడంలేదని, చలాన్లపై రాయితీలకు సంబంధించిన ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ ఇప్పటివరకు జారీ కాలేదని తెలిపారు. ప్రజలు ఇలాంటి తప్పుడు పోస్టులను నమ్మకుండా, మరెవరికి పంపకుండా జాగ్రత్తపడాలని సూచించారు. ఇక తరచూ చలాన్లపై డిస్కౌంట్లు ప్రకటించడం సరికాదని, అలాంటి రాయితీలు వాహనదారుల్లో భయం తగ్గించి నిబంధనల ఉల్లంఘనలు పెరిగే అవకాశముందని హైకోర్టు ఇప్పటికే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ట్రాఫిక్ చలాన్లపై ఎలాంటి రాయితీ లేదు. పెండింగ్ చలాన్ల గురించి నమ్మకమైన, అధికారిక సమాచారం కోసం మాత్రమే పోలీసుల వెబ్‌సైట్‌లు, యాప్‌లను వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.