దివ్యాంగునికి న్యాయం చేసిన ప్రజా ప్రభుత్వం

– సీఎం రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: కారుణ్య నియామకం కోసం దివ్యాంగుడైన కర్నాటి రామకృష్ణ 18ఏళ్లుగా చేసిన పోరాటం, ఆ కుటుంబం పడిన ఆవేదనకు రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం న్యాయం చేసింది. నాగేశ్వరరావు అనే వ్యక్తి కొత్తగూడెం పంచాయతీ రాజ్‌శాఖలో పనిచేస్తూ, 2007లో అనారోగ్యంతో మృతిచెందారు. అతనికి భార్య రాణి, దివ్యాంగుడైన రామకృష్ణ, కోటేశ్వరరావు అనే కుమారులు ఉన్నారు. అప్పటికే 21 సంవత్సరాల వయసున్న పెద్ద కుమారుడు రామకృష్ణ కారుణ్య నియామకం కోసం చేసుకున్న దరఖాస్తును అధికారులు పలు కారణాలతో పరిష్కరించలేదు. దీంతో ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా 2013 అక్టోబర్‌లో రామకృష్ణకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినా ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు. మరో కుమారుడు కోటేశ్వరరావుకు వివాహమై ఆటో నడుపుతూ కుటుంబంతో విడిగా ఉంటున్నాడు. తల్లితో ఉంటున్న రామకృష్ణ దిక్కు తోచని స్థితిలో ఉండగా రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిరది. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు 2023 డిసెంబర్‌లో ప్రారంభించిన ప్రజా దర్బార్‌లో కారుణ్య నియామకం కోసం రామకృష్ణ వినతి పత్రం ఇచ్చారు. ఆయన విజ్ఞాపనను సీఎంవో అధికారులు పరిశీలించి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దనసరి అనసూయ దృష్టికి తెచ్చారు. ఆమె ఆదేశాలతో ఆ శాఖ ఉన్నతాధికారులు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో రామకృష్ణను ఆఫీస్‌ సబార్దినేట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అశ్వారావుపేట సబ్‌ డివిజన్‌ ముల్కలపల్లి మండలంలో పోస్టింగ్‌ ఇచ్చారు. కాగా, ప్రజా దర్బార్‌ ద్వారా న్యాయం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి రామకృష్ణ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *