– రావు పద్మ, డాక్టర్ అనితా రెడ్డి
హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: మానసిక దివ్యాంగులకూ అన్ని హక్కులు ఉంటాయని, ముఖ్యంగా ఆస్తి హక్కు కూడా ఉంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని, ప్రేమను పంచాలని సూచించారు ప్రపంచ దివ్యాంగుల వారోత్సవాలను పురస్కరించుకున అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి అద్యక్షతన హన్మకొండలోని స్పందన మానసిక వికాస కేంద్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల హక్కుల కోసం శుక్రవారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బహుమతులు అందించారు, పిల్లల పాటలు, డాన్సులు అందరినీ అలరించాయి. పిల్లలకు పండ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావు పద్మ, ప్రత్యేక గౌరవ ఆత్మీయ అతిథిగా డాక్టర్ అనితా రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ మానసిక దివ్యాంగులైన చిన్నారులకు ఎలాంటి అవసరాలు ఉన్నా వారికి ఎల్లపుడూ అందుబాటులో ఉంటామన్నారు. వారి గుర్తింపు కార్డులు, పెన్షెన్ కార్డుల ప్రక్రియ సులభతరం చేయాలని , మానసిక నిపుణులు సందర్శించి వీరికి సేవలు అందించేలా సంబంధిత అధికారులను కోరుతామని తెలిపారు, డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల సేవ విశ్వమానవ సేవ అని అన్నారు. మానసిక దివ్యాంగుల హక్కులను కాపాడటం మన బాధ్యత అన్నారు. వారిని హేళన చేయడం, కొట్టడం, కట్టివేయడం చేస్తే శిక్షార్హులవుతారని హెచ్చరించారు. జిల్లాలోని దివ్యాంగుల సంస్థలన్నీ ఒక వేదికపైకి వచ్చి వారి సమస్యలు వివరించినప్పుడు ఫలితాలు బాగుంటాయన్నారు. వారికి ఓర్పుతో విద్య నేర్పుతూ మానసిక పరిపక్వత వచ్చేలా కృషి చేస్తున్న సంస్థలను అభినందించారు. కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు సుచరిత, రాజేందర్ రెడ్డి, వసుధ, హరిత పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





